కోడి రామకృష్ణ.( Kodi Ramakrishna ) ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
ఈ దిగ్గజ డైరెక్టర్ రకరకాల జానర్లలో మొత్తంగా వందకు పైగా సినిమాలను డైరెక్ట్ చేసి ఎంతో వినోదాన్ని పంచాడు.ఆ కాలంలో కూడా ఫిమేల్ సెంట్రిక్ ఫిలిమ్స్ తీసి ఆడవాళ్ళ చేత ప్రశంసలు అందుకున్నాడు.ఆ ఫిమేల్ సెంటర్ సినిమాలేవో ఇప్పుడు తెలుసుకుందాం.
• తరంగిణి:
1982లో వచ్చిన తరంగిణి సినిమా( Tharangini ) సూపర్ డూపర్ హిట్ అయింది.కోడి రామకృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన తొలి ఫిమేల్ సెంట్రిక్ మూవీ ఇది.ఇందులో సుమన్, భానుచందర్ కీలక పాత్రల్లో నటించారు.ఇక మెయిన్ రోల్‌లో శ్యామల గౌరీ యాక్ట్ చేసింది.
• ముక్కుపుడక:
1983లో కోడి రామకృష్ణ మరో లేడీ ఓరియంటెడ్ మూవీ ముక్కుపుడక( Mukkupudaka ) టైటిల్ తో డైరెక్ట్ చేశాడు.సుహాసిని ఇందులో ప్రధాన పాత్ర చేసింది.
• తలంబ్రాలు:
జీవితా రాజశేఖర్ నటించిన ఫిమేల్ సెంట్రిక్ సినిమా “తలంబ్రాలు(1987)”( Talambralu ) సినిమాని డైరెక్ట్ చేసింది కూడా ఈ దర్శకుడే.ఈ సినిమాను సూపర్ డూపర్ హిట్ అయింది.ఈ మూవీతో జీవిత ఫేట్ మారిపోయింది.
• మధురానగరిలో:
నటి నిరోషాది మెయిన్ లీడ్ చేసిన మధురానగరిలో (1991) కూడా లేడీ ఓరియంటెడ్ మూవీగా వచ్చే ఏం చాలామందిని ఆకట్టుకుంది.శ్రీకాంత్, చిన్నా, రవిశంకర్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.
• పెళ్ళాం చెబితే వినాలి:
పెళ్ళాం చెబితే వినాలి అంటూ 1992లో వచ్చిన మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు స్త్రీలకు ఉన్న ప్రాధాన్యతను హైలైట్ చేసింది.మీనా ప్రధాన పాత్రలో యాక్ట్ చేసిన ఈ మూవీలో హరీష్ హీరోగా యాక్ట్ చేశాడు.కోవై సరళ మంచి కామెడీ పండించి లేడీ కమెడియన్ కూడా కడుపుబ్బా నవ్వించగలదని నిరూపించింది.
• పోలీస్ లాకప్:
లేడీ సూపర్ స్టార్ విజయశాంతి డ్యూయల్ రోల్ చేసిన పోలీస్ లాకప్ (1993)( Police Lockup ) మూవీ కూడా ఆడవారిలో కోడి రామకృష్ణకు మంచి క్రియేట్ తెచ్చి పెట్టింది.వినోద్ కుమార్ హీరోగా చేసిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది.
• అమ్మోరు:
సౌందర్య ప్రధాన పాత్రలో, రమ్యకృష్ణ టైటిల్ రోల్‌లో తెరకెక్కిన అమ్మోరు (1995)( Ammoru ) సినిమాని చాలా బాగా తీశాడు కోడి రామకృష్ణ ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ వేరే లెవెల్ లో ఉండటంతో అప్పట్లో ఇది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.అంతేకాదు ఈ మూవీ మంచి కథతో వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ అయింది.
• దేవి:
ప్రేమ టైటిల్ రోల్ చేసిన ‘దేవి (1999)’ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఈ సినిమాతో ప్రేమకి చాలా గుర్తింపు దక్కింది.
• అరుంధతి:
అనుష్క శెట్టిని టైటిల్ రోల్ లో పెట్టి కోడి రామకృష్ణ తీసిన లేడీ ఓరియంటెడ్ మూవీ ‘అరుంధతి’( Arundhati ) కూడా అతిపెద్ద విజయం సొంతం చేసుకుంది.