పెదాలు గులాబీ రంగులో మెరిసిపోతూ ఉంటే చూసేందుకు ఎంత బాగుంటాయో ప్రత్యేకంగా వివరించి చెప్పాల్సిన అవసరం లేదు.అయితే వాతావరణంలో వచ్చే మార్పులు, ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యపానం, శరీరంలో అధిక వేడి, డెడ్ స్కిన్ సెల్స్‌ను తరచూ తొలగించకపోవడం, ఎండల ప్రభావం, కెమికల్స్ ఎక్కువగా ఉండే లిప్‌స్టిక్స్ వాడటం, కెఫిన్ ను ఓవన్‌గా తీసుకోవడం వంటి రకరకాల కారణాల వల్ల కొందరి పెదాలు నల్లగా మారుతుంటారు.
దాంతో పెదాల నలుపును వదిలించుకోవడం కోసం నానా ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తుంటారు.ఈ జాబితాలో మీరు గనుక ఉంటే అస్సలు వర్రీ అవ్వకండి.
ఎందుకంటే, ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ రెమెడీస్‌ను ట్రై చేస్తే పెదాలు ఎంత నల్లగా ఉన్నా గులాబీ రంగులోకి మారడం ఖాయం.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం పదండీ.
డార్క్ లిప్స్‌తో సతమతం అయ్యేవారు ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్, రెండు టేబుల్ స్పూన్ల కీరదోస రసం వేసుకుని అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్లై చేసి.
పూర్తిగా డ్రై అవ్వనివ్వాలి.ఆపై వేళ్లతో సున్నితంగా రుద్దుకుంటూ పెదాలను శుభ్రం చేసుకోవాలి.
ఇలా రోజుకు ఒకసారి చేస్తే నల్లటి పెదాలు గులాబీ రంగులోకి మారతాయి.
అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ అలోవెర జెల్, వన్ టేబుల్ స్పూన్ ఆముదం, వన్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేంత వరకు కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్లై చేసి.రెండు నిమిషాల పాటు మర్దనా చేసుకోవాలి.నైట్ నిద్రించే ముందు ఇలా చేసి.ఉదయాన్నే వాటర్‌తో పెదాలను క్లీన్ చేయాలి.
ఈ రెమెడీని పాటిస్తే పెదాలు గులాబీ రంగులోకి మారడం ఖాయం.
ఇక గుప్పెడు పుదీనా ఆకులను తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.ఈ పేస్ట్‌లో వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్ యాడ్ చేసి.పెదాలకు పట్టించాలి.
కంప్లీట్‌గా డ్రై అయ్యాక.అప్పుడు వాటర్‌తో పెదాలను కడగాలి.
ఇలా రోజూ చేసినా మంచి ఫలితం ఉంటుంది.