నిజామాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.నిజామాబాద్ పట్టాన మేయర్(Mayor) నీతుకిరణ్ మేయర్ భర్త, బీఆర్‌ఎస్(BRS) నేత దండు చంద్రశేఖర్‌పై దారుణంగా దాడి జరిగింది.
ఈ సంఘటనకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం.నిజామాబాద్(Nizamabad) జిల్లా కేంద్రంలోని కంపెనీ నాగారం కార్యాలయం బయట చంద్రశేఖర్, అతని అనుచరులు నిలబడి ఉన్న సమయంలో.
ఆటో డ్రైవర్ షేక్ రసూల్ చంద్రశేఖర్ (Auto driver Sheikh Rasool Chandrasekhar)వద్దకు వచ్చి ముఖంపై ఒక్కసారి గా కొట్టాడు.దాంతో ఒక్కసారిగా చంద్రశేఖర్ నేలపై కిందపడిపోయాడు.
ఆ తరవాత తన అనుచరులను బెదిరించడంతో వారు నోరు మెదపలేదు.అనంతరం ఆటోలో తీసుకొచ్చిన సుత్తితో చంద్రశేఖర్ ముఖంపై రసూల్ కొట్టాడు.దీంతో చంద్రశేఖర్ పై దవడకు తీవ్ర గాయాలయ్యాయి.గాయపడిన చంద్రశేఖర్‌ను సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.దాడి జరిగిన సమయంలో ఓ వ్యక్తి తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఏసిపీ రాజావెంకట్ రెడ్డి (ACP Raja Venkat Reddy)నిజామాబాద్‌లో ఆయనతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
అయితే ప్రస్తుతం చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అతడికి ఎలాంటి ప్రాణహాని లేదని ఏసీపీ తెలిపారు.మేయర్ నీతుకిరణ్(Mayor Neethukiran) ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.
ఈ ఘటనతో నిజామాబాద్ నగరం ఒక్కసారిగా ఉల్లికి పడింది.ఘటన నేపథ్యంలో మేయర్ నీతూకిరణ్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.అతి త్వరలో నిందితుడిని పట్టుకుంటామని తెలిపారు.