ఈ ఏడాది అడ్వాన్స్ బుకింగ్స్ లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన సినిమాలు ఏవో తెలుసా?

ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమా చూస్తే ఆ కిక్కే వేరు.ఎంత ఓటీటీ వచ్చినా అటు సినిమా థియేటర్కు వెళ్తేనే అసలుసిసలైన సినిమా ఎంజాయ్ చేయవచ్చు అని చెబుతూ ఉంటారు.

 Tollywood Movies Highest Advance Bookings List , Advance Bookings , Tollywood Mo-TeluguStop.com

కానీ కరోనా వైరస్ కారణంగా ఎంతోమంది థియేటర్లకు వెళ్లాలంటేనే భయపడిపోయారు.ఇక అప్పట్లో సినిమాలు కూడా పెద్దగా విడుదల కాలేదు.

కానీ ఇప్పుడు మాత్రం కరోనా వైరస్ ప్రభావం తగ్గడంతో మొన్నటి వరకు వేచి చూసిన అభిమానులు అందరూ అడ్వాన్స్ బుకింగ్ చేసుకొని మరీ సినిమాలు చూడటానికి తరలి వెళ్తున్నారు.ఈ ఏడాది భీమ్లా నాయక్ సినిమాతో మొదలైన బాక్సాఫీస్ జాతర కే జి ఎఫ్ చాప్టర్ 2 వరకు కూడా కొనసాగుతూనే ఉంది అన్న విషయం తెలిసిందే.

Telugu Acharya, Advance, Bhimla Nayak, Hyderabad, Kgf Chapter, Radheshyam, Theat

మరికొన్ని రోజుల్లో ఆచార్య తో మరోసారి బాక్సాఫీస్ దగ్గర సందడి ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.ఒక రాధేశ్యామ్ సినిమా మినహా ఇప్పటి వరకు విడుదలైన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ విజయం సాధించాయి.ఇప్పటివరకూ విడుదలైన భారీ బడ్జెట్ సినిమాలలో ఏది ఎక్కువ అడ్వాన్స్ బుకింగ్ సొంతం చేసుకుంది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ఫిబ్రవరి 25 న విడుదలైన భీమ్లా నాయక్ అడ్వాన్స్ బుకింగ్ లో హిస్టరీ క్రియేట్ చేసింది.295 రూపాయల టికెట్ రేట్స్ తో ప్రారంభించిన అడ్వాన్స్ బుకింగ్ నైజం ప్రాంతంలో అసలు టికెట్ ముక్క కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది.అడ్వాన్స్ బుకింగ్ ద్వారా హైదరాబాద్ నుండి ఎనిమిది కోట్లు వసులు అయ్యాయి.

ఇక అటు ఓవర్సీస్లో కూడా వన్ మిలియన్ కు పైగా అడ్వాన్స్ బుకింగ్ లు జరిగాయట.ఇలా అడ్వాన్స్ బుకింగ్ లు ద్వారానే 36 కోట్ల వరకు వసూలు అయినట్లు తెలుస్తోంది.

Telugu Acharya, Advance, Bhimla Nayak, Hyderabad, Kgf Chapter, Radheshyam, Theat

ఇక భీమ్లా నాయక్ సినిమా తర్వాత విడుదలైన రాధేశ్యామ్ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కాగా భారీ బడ్జెట్ మూవీ రాధేశ్యామ్ కి 30 కోట్లు మాత్రమే అడ్వాన్స్ బుకింగ్స్ వచ్చాయి.ఇక ఆ తర్వాత వచ్చిన త్రిబుల్ ఆర్ మాత్రం కనీవిని ఎరుగని రీతిలో అడ్వాన్స్ బుకింగ్స్ లో కొత్త రికార్డు క్రియేట్ చేసింది.అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 60 కోట్లు గ్రాస్ సంపాదించింది.

అన్నీ భాషల్లో వంద కోట్లకు పైగా వసూలు చేసింది.కే జి ఎఫ్ చాప్టర్ 2 ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి 100 కోట్లు వసూలు చేయడం గమనార్హం.

ఆచార్య ప్రస్తుత ట్రెండ్ ప్రకారం అడ్వాన్స్ బుకింగ్లో 40 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube