కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabham ) ఇవాళ వైసీపీలో చేరనున్నారు.సీఎం జగన్ సమక్షంలో ముద్రగడతో పాటు ఆయన కుమారుడు గిరి వైసీపీ కండువా కప్పుకోనున్నారు.
ఇందుకోసం ముద్రగడ, ఆయన కుమారుడు ఇప్పటికే కిర్లంపూడి నుంచి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి( Tadepalli Camp Office ) చేరుకున్నారు.కాగా ఉమ్మడి గోదావరి జిల్లాలపై వైసీపీ( YCP ) ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కీలక నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తుంది.కాగా వైసీపీలో ముద్రగడ పాత్ర ఎలా ఉండనుందనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.