టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో రెజీనా( Regina ) ఒకరు.ఈమె తమిళ చిత్రాలతో హీరోయిన్ గా తన కెరియర్ ప్రారంభించినప్పటికీ తమిళ తెలుగు భాష చిత్రాలలో హీరోయిన్గా నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇలా నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె మరోవైపు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ప్రేక్షకులను సందడి చేశారు.ఇటీవల కాలంలో ఈమెకు సినిమా అవకాశాలు లేవనే చెప్పాలి.
ఇలా వెండి తెరకి దూరంగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తూ ఉంటారు.ఇకపోతే ఇటీవల కాలంలో రెజినా పెళ్లి( Regina Marriage ) గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే .ఈమె ఒక ప్రముఖ బిజినెస్ మెన్( Business Man ) తో ఏడడుగులు నడవబోతున్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ఈ వార్తలు వచ్చిన అనంతరం ఈమె సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఒక పోస్టు కూడా ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఇందులో భాగంగా రెజీనా తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేయడమే కాకుండా పోలింగ్ ఫర్ ఎంగేజ్ మెంట్ అంటూ తన సోషల్ మీడియా ఫ్యాన్స్, ఆడియెన్స్ ను ఉద్దేశించి పోస్టు చేశారు.ఇలా ఈమె పోస్ట్ చేయడంతో బహుశా ఈమె నిశ్చితార్థం( Engagement ) చేసుకోబోతున్నారని అందుకే ఇలా అభిమానులతో పంచుకున్నారు అంటూ ఈ విషయంపై నేటిజన్స్ స్పందిస్తూ కొందరు శుభాకాంక్షలు చెప్పగా మరికొందరు పెళ్లి ఎప్పుడు అంటూ ఈమెను ప్రశ్నిస్తున్నారు.మరి నిజంగానే ఈమె పెళ్లి చేసుకోబోతున్నారా అందుకే ఇలాంటి పోస్ట్ చేశారా లేకపోతే మరేదైనా కారణం ఉందా అనేది తెలియాలి అంటే రెజీనా స్పందించాల్సి ఉంది.