తెలుగులో ప్రముఖ దర్శకుడు మారుతి దర్శకత్వం వహించిన “ఈ రోజుల్లో” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు నటిగా పరిచయమై “బ్యూటీ ఆనంది” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే తన మొదటి చిత్రంలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఎవరు గుర్తించలేదు.
కానీ మళ్ళీ దర్శకుడు మారుతి దర్శకత్వం వహించిన “బస్ స్టాప్” అనే చిత్రంలో “సీమ” పాత్రలో నటించి ప్రేక్షకులని బాగానే అలరించింది.అయినప్పటికీ ఈ అమ్మడికి అవకాశాలు వరించలేదు.
కానీ తమిళంలో ఈ అమ్మడి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నాయి. దీంతో తెలుగులో కంటే ఎక్కువగా తమిళంలో బాగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా సినీ అవకాశాలు కూడా దక్కించుకుని ప్రస్తుతం బాగానే రాణిస్తోంది.
ఇందులో భాగంగా ప్రస్తుతం దాదాపుగా ఐదు చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తోంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తమిళ సినీ పరిశ్రమలో మన తెలుగు బ్యూటీకి ఉన్నటువంటి క్రేజ్ ఏంటో అని. దీంతో కొందరు సినీ క్రిటిక్స్ ఈ విషయంపై స్పందిస్తూ తెలుగులో అవకాశాలు దక్కించుకోలేక చాలా మంది నటీమణులు తమిళ సినీ పరిశ్రమలోకి వలస వెళుతున్నారని ఈ క్రమంలో అక్కడ బాగానే క్లిక్ అవుతున్నారని ఇందులో నటి అంజలి స్వతహాగా తెలుగు అమ్మాయి అయినప్పటికీ తమిళంలో బాగానే రాణిస్తుందని ఉదాహరణగా చెబుతున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో ఆనంది నటించినటువంటి బస్ స్టాప్, ప్రియతమా నీవచట కుశలమా, గ్రీన్ సిగ్నల్, తదితర చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.
అయితే ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించాయి. అంతేకాక తెలుగులో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన నాయక్ అనే చిత్రంలో కూడా గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలో నటించింది.
కానీ ఈ చిత్రంలో ఈ అమ్మడు పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఎవరు గుర్తించలేదు.