వామ్మో ఆ రెండు భవనాలు 200 కోట్లట.. అంత రేటు ఎందుకంటే?

రెండు భవనాల విలువ 200 కోట్ల రూపాయిలు అంటే ఎవరికైనా సరే ఆశ్చర్యం వేస్తుంది.

అన్ని కోట్ల రూపాయల విలువ చేసే ఆ భవనం ప్రత్యేకత ఏంటో అని అనిపించచ్చు.

నిజానికి ప్రస్తుతం కట్టే భవనాలకు కోట్ల రూపాయలతో నిర్మించారు అంటే అది సహజమే.కానీ ఈ రెండు భవనాలు 1918 సంవత్సరంలో నిర్మించారు.

కానీ ప్రస్తుతం ఆ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి.అయినా ఆ భవనాల ను 200 కోట్లకు కొనుగోలు చేయాలని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించింది.

మరి ఆ భవనాలలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? పాకిస్తాన్ ప్రభుత్వం అంత ఖర్చు చేసి ఎందుకు కొంటుందో ఇక్కడ తెలుసుకుందాం.ఒకప్పటి బాలీవుడ్ అగ్ర నటులు దిలీప్ కుమార్, రాజ్ కపూర్ పూర్వీకుల కు చెందిన ఈ భవనాలను కపూర్ హవేలి అని పిలుస్తారు.

Advertisement

ఈ భవన నిర్మాణాన్ని 1918 నుంచి 1922 వరకు అగ్ర నటుడు దిలీప్ కుమార్ తాత అయిన భాషేశ్వర్నాథ్ కపూర్ నిర్మించారు.ఈ భవనంలోనే రాజ్ కపూర్ కూడా జన్మించారు.

దీనిని ప్రాంతీయ ప్రభుత్వం జాతీయ వారసత్వంగా ప్రకటించింది.ఈ భవనాల యజమానులు గతంలో ఈ భవనాలను కూల్చివేయాలని ప్రయత్నించారు.

కానీ పురావస్తు శాఖ అడ్డు పడింది.వందేళ్లకుపైగా చరిత్ర కలిగి ఉండి, జాతీయ వారసత్వ సంపదగా ప్రకటించబడిన ఈ భవనాలను యజమానుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేయాలని పాకిస్తాన్ లోని ఖైబర్‌ ఫక్తూన్ ‌క్వా ప్రభుత్వం నిర్ణయించుకుంది.

అయితే ఇందుకు గాను నిధులు విడుదల చేయాలని, అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.ఈ రెండు భవంతులకు యజమానులు ఒకటి కాదు రెండు కాదు 200 కోట్ల రూపాయలను డిమాండ్ చెయ్యడం అక్కడ ప్రజలను షాక్ కు గురి చేసింది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

పురాతన భవనలు ఆ మాత్రం రేట్లు ఉంటాయ్ అంటూ మరికొందరు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు