పాము కాటు వేసినప్పుడు కాఫీ తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

మనదేశంలో పాముకాటుకు గురై మరణించే వారి సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది.అయితే ఎక్కువగా పల్లెల్లో నివసించే ప్రజలు పాముకాటుకు గురవుతున్నారు.

రైతులు పొలం పనులకు వెళ్లినప్పుడు పాము కాటుకు గురవుతున్నారు.రాత్రి సమయాలలో పొలం పనులకు వెళ్ళినప్పుడు, ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

మరి పాముకాటుకు గురైన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.ఏ పనులు చేయకూడదు అన్న విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

పాము కరిచినప్పుడు మన చర్మంపై రెండు చిన్న గుర్తులు కనిపిస్తే, అవి పాము కరవడం వల్ల సంభవిస్తాయి.అయితే ఆ పాము కోరలు కలిగి ఉంటుంది.

Advertisement

అలాంటి పాములు కరిచినప్పుడు విషపూరిత మవుతుంది.కొన్నిసార్లు మరణం కూడా సంభవిస్తుంది.

పాము కరిచినప్పుడు ఆ ప్రాంతం కొద్దిగా వాపు కనిపిస్తుంది.అంతే కాకుండా ఆ ప్రాంతంలోని చర్మం కొద్దిగా పాలిపోయినట్లు నల్లగా మారుతుంది.

పాము కరిచిన వ్యక్తి కి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కరంగా ఉంటుంది.శరీరం మొత్తం చెమటలు రావడం, వాంతులు, వికారం వంటి సమస్యలు తలెత్తుతాయి.

పాముకాటుకు గురైన వ్యక్తిని వీలైనంత వరకు అటు ఇటు కదల్చకుండా జాగ్రత్త తీసుకోవాలి.అలా చేయడం వల్ల విషం తొందరగా శరీరం మొత్తం పాకి పోతుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

నీరు, టీ వంటి ద్రావణాలను అధికంగా తీసుకోవాలి.వీటికి మన శరీరంలో విష వ్యర్థాలను తొలగించే శక్తి ఉంటుంది.

Advertisement

విష ప్రభావం శరీరం మొత్తం పాకకుండా గాయం పైభాగంలో గట్టిగా బిగించాలి.నోటితో విషయం తీయడం వంటి ప్రయోగాలు అసలు చేయకూడదు.

అంతేకాకుండా పాము కరిచిన భాగంలో ఎటువంటి ఆయింట్మెంట్లు, క్రీమ్లు కానీ పట్టించ రాదు.ముఖ్యంగా మద్యం లేదా కాఫీ వంటి వాటిని తీసుకోకూడదు.

కాఫీలో ఉండే కెఫిన్ అనే పదార్థం విష ప్రభావాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది.వీలైతే మీకు కరచిన పాము చనిపోయి ఉంటే దానిని ఒక ప్లాస్టిక్ కవర్ లో ఉంచుకొని డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్తే, మీరుఎటువంటి పాము కాటుకు గురయ్యారో తెలుస్తుంది.

దాన్ని బట్టి చికిత్స చేయడానికి ఎంతో సులభంగా ఉంటుంది.

తాజా వార్తలు