నేటి ఎన్నికల ప్రచారం :   నంద్యాలలో లోకేష్ .. జగన్ ఎక్కడంటే 

మరో పది రోజుల్లో ఏపీలో పోలింగ్ జరగబోతుండడంతో ప్రధాన పార్టీల కు చెందిన కీలక నాయకులంతా ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడుపుతున్నారు.మొన్నటి వరకు మంగళగిరి నియోజకవర్గానికే పరిమితమై,  అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ వస్తున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh )రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

 Where Is Lokesh Jagan In Today's Election Campaign, Tdp, Janasena, Bjp, Janasena-TeluguStop.com

నిన్ననే హలో లోకేష్ అంటూ చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని అయితే పల్లి వద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సభకు భారీగా జనం హాజరు కావడంతో మరింత ఉత్సాహంగా లోకేష్ కనిపిస్తున్నారు.

Telugu Jagan Shedyul, Janasena, Janasenani, Lokesh, Telugudesam, Lokeshjagan, Ys

నేడు యువ గళం కార్యక్రమాలతో( Yuva Galam programs ) టిడిపికి ఊపు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.దీనిలో భాగంగానే ఈరోజు నంద్యాలలో యువ గళం కార్యక్రమాన్ని లోకేష్ నిర్వహించనున్నారు.ఎన్టీఆర్ నగర్ సమీపంలో సాయంత్రం యువ గళం సభలో పాల్గొని లోకేష్ ప్రసంగించనున్నారు.దీనిలో భాగంగానే ఈరోజు నంద్యాలలోని ఓ ఫంక్షన్ హాలులో లోకేష్ బస చేశారు.

ఉదయం నుంచి ఫంక్షన్ హాల్ లో వివిధ సామాజిక వర్గాలకు చెందిన నాయకులతో లోకేష్ సమావేశం అయ్యారు.ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాణి ధియేటర్ వెనుక ఉన్న ప్రాంతంలో టిడిపి ( TDP )నాయకులతో నారా లోకేష్ సమావేశమై ఎన్నికల కు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు.

ఈ సందర్భంగా పార్టీ కేడర్ కు దిశా నిర్దేశం చేయనున్నారు.

Telugu Jagan Shedyul, Janasena, Janasenani, Lokesh, Telugudesam, Lokeshjagan, Ys

జగన్ నేటి షెడ్యూల్

వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్ ( AP CM Jagan )నేడు మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.  ఇప్పటి వరకు వరుసగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ వస్తున్న జగన్ నిన్న ఎన్నికల ప్రచారానికి విరామం ప్రకటించి , పార్టీ ముఖ్య నేతలతో వివిధ అంశాలపై చర్చించారు.  ఈరోజు నుంచి మళ్లీ ఎన్నికల ప్రచారాన్ని జగన్ మొదలుపెట్టనున్నారు.

ఈరోజు ఉదయం 10 గంటలకు నరసాపురం లోక్ సభ స్థానం పరిధిలోని నరసాపురం లో జరిగే కార్నర్ మీటింగ్ లో జగన్ పాల్గొంటారు.  మధ్యాహ్నం 12.30 గంటలకు నరసరావుపేట లోక్ సభ పరిధిలోని పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరులో జరిగే బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు.  మధ్యాహ్నం మూడు గంటలకు ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కనిగిరి నియోజకవర్గంలోని పామూరు బస్టాండ్ సెంటర్ లో జరిగే ప్రచారంలో జగన్ పాల్గొంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube