అమెరికాలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో చదువుకోవాలని చాలామంది విదేశీ విద్యార్థులు కలలు కంటారు.భారతదేశంలో కూడా లక్షల మంది విద్యార్థులు యూఎస్ఏకి (USA) వెళ్లి చదువుకోవాలనుకుంటారు.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది విద్యార్థులు అమెరికాకి (America)వెళుతుంటారు.అయితే వారి కలలను సాకారం చేసే దిశగా అమెరికా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.
లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, యూఎస్ఏ గవర్నమెంట్ స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూ స్లాట్స్ ( visa interview slots) రిలీజ్ చేసేందుకు సన్నాహాలు మొదలు పెట్టేసింది.
విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి దశలవారీగా ఈ వీసా(visa) ఇంటర్వ్యూ స్లాట్లను విడుదల చేయనున్నట్లు సమాచారం.ఈ వీసా వివిధ రంగాలలో నైపుణ్యం పొందడానికి, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేందుకు వీలు కల్పిస్తుంది.2024, మే రెండో వారం నుంచి ఇంటర్వ్యూ స్లాట్లను రిలీజ్ కావడం మొదలు పెడతారు.ఈ స్లాట్లు ఆగస్టు రెండో వారం వరకు అందుబాటులో ఉంటాయి.అమెరికాలో ఫాల్ సీజన్‌కు సంబంధించిన సెమిస్టర్ ఆగస్టు నెల, సెప్టెంబర్ నెల మధ్యకాలంలో స్టార్ట్ అవుతుందని గమనించాలి.
ఇండియాలోని యూఎస్ఎ ఎంబసీ(USA Embassy) ఆఫీస్‌తో పాటు హైదరాబాద్, చెన్నై, కోల్‌కత్తా, ముంబై కాన్సులేట్ ఆఫీస్‌ల్లో ఇంటర్వ్యూ స్లాట్లు అవైలబుల్ గా ఉంటాయి.ఈ కార్యాలయాలు ఇండియన్ స్టూడెంట్స్ కి కావాల్సిన సర్వీసులు అందించేందుకు ఏర్పాట్లు చేయనున్నాయి.కాన్సులేట్ వర్గాలు ఇండియన్ స్టూడెంట్ కు ఎక్కువ ప్రయారిటీ ఇస్తామని ప్రకటించాయి.ఇండియాలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత చాలామంది అమెరికాలో ఐటి కోర్సులు బిజినెస్ కోర్సులు చేయడానికి మొగ్గు చూపుతున్నారు.
క్వాలిటీ ఎడ్యుకేషన్‌ను అక్కడ అభ్యసించి మెరుగైన ప్లేస్‌మెంట్స్ ఆఫర్స్ పొందాలనుకుంటున్నారు.అక్కడే చాలామంది సెటిల్ కావడానికి కూడా మొగ్గు చూపుతున్నారు.యూఎస్ఎలో విద్యనభ్యసిస్తున్న ప్రతి 10 లక్షల మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌లో 2.5 లక్షల మంది భారతీయులే ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి.అంటే ఏకంగా 25% మంది చదువుకుంటున్నారు.ఇతర దేశాల విద్యార్థుల కంటే ఇండియన్స్ యూఎస్ఏలో చదువుకోవడానికి ఎంత ఆసక్తి చూపిస్తున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.