ఇటీవల ఉక్రెయిన్‌లోని ఒడెసాపై రష్యా పెద్ద క్షిపణితో దాడి చేసింది.ఈ విషాద సంఘటనలో ఐదుగురు మరణించారు, 23 మందికి పైగా గాయపడ్డారు.
ఇదే ప్రదేశంలో హ్యారీ పోటర్( Harry Potter) సినిమాల్లో కనిపించే కాల్పనిక కోట లాంటిది ఒకటి ఉంది.హ్యారీ పోటర్ కోట అని పిలిచే ఈ భవనాన్ని లక్ష్యంగా రష్యా దాడి చేసింది.
ఈ భవనం పేరు కివలోవ్ మాన్షన్.రష్యా (russian)దాడి వల్ల అది మంటల్లో చిక్కుకుపోయి నాశనం అయ్యింది.
దీని గురించి బీబీసీ న్యూస్ తెలియజేసింది ఈ విషయం తెలిసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హ్యారీ పోటర్ ఫ్యాన్స్ గుండె పగులుతున్నారు.
రష్యా బలగాలు ఈ దాడికి క్లస్టర్ బాంబులతో పాటు ఇస్కాండర్ బాలిస్టిక్ క్షిపణి అని పిలిచే నిర్దిష్ట రకం క్షిపణిని ఉపయోగించినట్లు ఉక్రెయిన్(ukraine) అధికారులు నివేదించారు.
దాదాపు 20 ఇళ్లు, కీలకమైన నిర్మాణాలు దెబ్బతిన్నాయి.గాయపడిన వారిలో ఒకరు భవనంలో నివసించిన మాజీ పార్లమెంటు సభ్యుడు కావడం గమనార్హం.క్లస్టర్ బాంబుల వాడకం సాధారణంగా అంతర్జాతీయ ఒప్పందాల ద్వారా బ్యాన్ చేశారు.అయినప్పటికీ రష్యన్ సైనికులు వాటిని ఈ దాడిలో ఉపయోగించారు.
దాడి జరిగిన ప్రదేశం నుంchi 1.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో లోహపు శకలాలు, క్షిపణి భాగాలు వంటి దాడికి సంబంధించిన సాక్ష్యాలు కనుగొనబడినట్లు ఉక్రెయిన్ చీఫ్ లీగల్ ఆఫీసర్ ఆండ్రీ కోస్టిన్ తెలిపారు.రష్యా మిలిటరీ ఉద్దేశపూర్వకంగా జరిగిన నష్టాన్ని పెంచడానికి క్లస్టర్ బాంబులను ఎంచుకున్నట్లు దర్యాప్తు సూచిస్తుంది.గాయపడిన వారిలో ఇద్దరు చిన్నారులు, ఓ గర్భిణి ఉండటంతో మొత్తం మృతుల సంఖ్య 30కి చేరింది.
ఈ దాడులు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేశాయి.కొందరు చారిత్రక ప్రదేశాన్ని లక్ష్యంగా చేసుకోవడం వెనుక ఉన్న తర్కాన్ని ప్రశ్నించగా, మరికొందరు యుద్ధ నిధులను నిలిపివేయాలని పిలుపునిచ్చారు.ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా ఉన్న అసమానతలను పరిగణనలోకి తీసుకుని పోరాటాన్ని కొనసాగించకూడదనే సూచనలు ఉన్నాయి.ఈ వివాదంలో చిక్కుకున్న ఉక్రెయిన్, రష్యాలోని అమాయక ప్రజల పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.
రెండవ ప్రపంచ యుద్ధంతో రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని పోలుస్తున్నారు.