ప్రసన్నవదనం మూవీ రివ్యూ.. సుహాస్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరినట్టేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా వరుస విజయాలు సాధించాలంటే లక్ ఉండాలి.అయితే హీరో సుహాస్(Suhas) కు మాత్రం ఆ అదృష్టం పుష్కలంగా ఉంది.

 Hero Suhas Prasannavadanam Movie Review And Rating Details Here , Suhas, Prasann-TeluguStop.com

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సుహాస్ తన సక్సెస్ రేట్ ను పెంచుకుంటున్నారు.సుహాస్ హీరోగా నటించిన ప్రసన్నవదనం(prasannavadanam) మూవీ నేడు థియేటర్లలో విడుదలైంది.ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఒక వర్గం ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

కథ :

Telugu Chandrasekaran, Prasannavadanam, Suhas, Viva Harsha-Movie

ఆర్జేగా పని చేసే సూర్య ( సుహాస్) ఒక ప్రమాదంలో పేరెంట్స్ ను కోల్పోవడంతో పాటు ప్రోసాపాగ్నోసియా అనే అరుదైన వ్యాధి బారిన పడతాడు.ఫేస్ బ్లైండ్ నెస్ కు సంబంధించిన ఈ సమస్య వల్ల సూర్య ఇతరుల ముఖాలను, వాయిస్ ను గుర్తించడంలో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాడు.ఈ సమస్య గురించి ఇతరులకు చెప్పడం ఇష్టం లేని సూర్య తన బెస్ట్ ఫ్రెండ్ అయిన విఘ్నేష్ (వైవా హర్ష) (Viva Harsha) కు తప్ప ఎవరికీ ఈ సమస్య గురించి చెప్పడు.

ఆ తర్వాత ఆద్య (పాయల్ రాధాకృష్ణ)(Payal Radhakrishna)తో ప్రేమలో పడిన సూర్య తన కళ్ల ముందు జరిగిన ఒక హత్య వల్ల ఇబ్బందుల్లో పడతాడు.అయితే ఊహించని విధంగా సూర్యనే ఈ కేసులో తనే హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఈ సమస్యల నుంచి సూర్య ఎలా బయటపడ్డాడు ? హత్య చేసింది ఎవరు ? ఆద్యతో సూర్య లవ్ సక్సెస్ అయిందా అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

విశ్లేషణ :

Telugu Chandrasekaran, Prasannavadanam, Suhas, Viva Harsha-Movie

ఈ మధ్య కాలంలో దర్శకులు హీరో పాత్రకు డిజార్డర్ పెట్టి కథను నడిపించడం తరచూ చూస్తూనే ఉన్నాం.సుహాస్ గత సినిమాలతో పోల్చి చూస్తే ఈ సినిమా భిన్నంగా ఉంది.సరదా సన్నివేశాలతో మొదలైన సినిమా హీరో హత్యను చూడటంతో మలుపు తిరుగుతుంది.

ఇంటర్వెల్, క్లైమాక్స్ ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా మంచి అనుభూతిని పంచుతుంది.

Telugu Chandrasekaran, Prasannavadanam, Suhas, Viva Harsha-Movie

సూర్య పాత్రకు తన నటనతో సుహాస్ ప్రాణం పోశారనే చెప్పాలి.టెక్నికల్ గా కూడా ఈ సినిమా టాప్ రేంజ్ లో ఉంది.విజయ్ బుల్గానిన్ బీజీఎం, చంద్రశేఖరన్ (Vijay Bulganin BGM, Chandrasekaran)సినిమాటోగ్రఫీ ఆకట్టుకున్నాయి.డైరెక్టర్ అర్జున్ తొలి సినిమాతోనే ప్రతిభ చూపి సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారు.నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

సుహాస్ నటన, సెకండాఫ్, ఇంటర్వెల్ ట్విస్ట్

మైనస్ పాయింట్స్ :

ఇంట్రడక్షన్ సన్నివేశాలు

రేటింగ్ :

3.0/5.0

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube