ఈ దశలో గాజు గ్లాసు గుర్తు మార్చలేం తేల్చి చెప్పిన ఈసీ..!!

ఏపీలో ఎన్నికల దగ్గర పడే కొలది ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ప్రధానంగా జనసేన పార్టీ( Janasena party ) గాజు గ్లాసు గుర్తు ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చడం కూటమి పార్టీల నేతలకు ఊహించని షాక్ ఇవ్వటం జరిగింది.

 At This Stage The Mark Of The Glass Glass Cannot Be Changed Said Ec, Ap Electio-TeluguStop.com

జనసేన పోటీ చేసే చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు ఇవ్వకుండా మిగతా చోట్ల ఈ గుర్తును ఫ్రీ సింబల్ గా చేర్చింది.దీంతో ఈ ఎన్నికలలో పోటీ చేసే చాలామంది.

రెబల్స్ అభ్యర్థులు గాజు గ్లాస్ గుర్తు కేటాయించాలని పోటీ పడుతున్నారు.

ఈ క్రమంలో స్వతంత్ర అభ్యర్థులకు( independent candidates ) గాజు గ్లాసు గుర్తు కేటాయించడంపై టీడీపీ వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.దీని వల్ల తమ కూటమికి నష్టం కలుగుతుందని టీడీపీ( TDP ) తరఫు లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.అయితే ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైందని, ఈ దశలో గుర్తు మార్చలేమని ఈసీ తరఫు లాయర్ వాదించారు.

దీంతో తదుపరి విచారణను ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది.గాజు గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చడం వల్ల జనసేన పోటీ చేయని చోట్ల.తెలుగుదేశం పార్టీకి భారీ డామేజ్ అయ్యే అవకాశం ఉంది.దీంతో ఏదో రకంగా గాజు గ్లాస్ గుర్తును పూర్తిగా జనసేనకే పరిమితమయ్యే విధంగా తెలుగుదేశం పోరాడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube