ముద్రగడపై నటుడు పృథ్వీరాజ్ సీరియస్ వ్యాఖ్యలు..!!

వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabham ) పై జనసేన నేత నటుడు పృథ్వీరాజ్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.భీమవరం జనసేన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పృథ్వీరాజ్ మాట్లాడుతూ.

 Actor Prithviraj Serious Comments On Mudragada, Ap Elections, Actor Prithviraj,-TeluguStop.com

పిఠాపురంలో పవన్ నీ ఓడిస్తామంటున్న ముద్రగడపై ఒకప్పుడు మంచి అభిప్రాయం ఉండేది.కానీ అదంతా ఉత్తిదేనని ఇప్పుడు తెలిసిపోయింది అన్నారు.

ఆయనకు రెడ్డి కాపు అనే నామకరణం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.రెడ్లకు ఊడిగం చేస్తున్న ముద్రగడకు సిగ్గుందా.? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.వైయస్ జగన్( YS Jagan ) గురించి నీకంటే నాకు ఎక్కువ తెలుసు.

ఎందుకంటే ఆయనతో పది సంవత్సరాలు ఉండటం జరిగింది.

ఇదే సమయంలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పెళ్లిళ్లపై వైసీపీ నాయకులు చేసే విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇవ్వడం జరిగింది.మంత్రి రోజాపై కూడా పృధ్వీరాజ్ విమర్శలు చేశారు.చంద్రబాబు అరెస్టు అయిన సమయంలో జైల్లో పవన్ పలకరించిన సమయంలో రోజా మాట్లాడిన వ్యాఖ్యలను ఖండించారు.

కచ్చితంగా వచ్చే ఎన్నికలలో తమ కూటమి అధికారంలోకి వస్తుందని ప్రభుత్వం స్థాపిస్తుందని స్పష్టం చేయడం జరిగింది.ఏపీలో ఎన్నికలకు ఇంకా పది రోజులు మాత్రమే సమయం ఉంది.

మే 13వ తారీకు పోలింగ్ జరగనుంది.ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.2014లో గెలిచినట్లు 2024లో గెలవాలని భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube