తెలుగు సినీ ప్రేక్షకులకు నటి వరలక్ష్మి శరత్ కుమార్ ( Actress Varalakshmi Sarath Kumar )గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.క్రాక్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.
వరలక్ష్మి శరత్ కుమార్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె విలనిజం.ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న వరలక్ష్మి శరత్ కుమార్ తాజాగా శబరి ( Sabari )అనే మూవీతో ప్రేక్షకులను పలకరించింది.
ఈ సినిమా తాజాగా మే మూడవ తేదీన విడుదల అయింది.అనిల్ కాట్జ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు.మరి తాజాగా విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? కథ ఏమిటి అన్న వివరాల్లోకి వెళితే.
కథ :
సంజన (వరలక్ష్మి)తాను ప్రేమించిన అరవింద్ (గణేష్ వెంకట్రామన్)ను వదిలి తన కూతురు రియాతో కలిసి బయటకు వచ్చేస్తుంది.తన ఫ్రెండ్ లాయర్ రాహుల్ (శశాంక్) ఆపద కాలంలో తనకు సహాయం చేస్తూ ఉంటాడు.మరో వైపు సూర్య (మైమ్ గోపీ) రియా కోసం అందరినీ చంపుతుంటాడు.
రియా తన కూతురేనని తనకు ఇచ్చేయమని సంజనను బెదిరిస్తుంటాడు.కానీ సూర్య అనే వాడు లేడని, ఎప్పుడో చనిపోయాడని లాయర్ రాహుల్, పోలీసులు చెబుతారు.అసలు సంజన, అరవింద్‌లు ఎందుకు విడిపోతారు? సంజన గతం ఏంటి? చివరకు తన కూతురీ కోసం సంజన ఏం చేస్తుంది? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల నటన:
సంజన పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ చాలా చక్కగా నటించడంతో పాటు ఎమోషన్స్ ను బాగా పండించింది.భయస్తురాలిగా, ధైర్యవంతురాలిగా అన్ని రకాల వేరియేషన్స్ చూపించి నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.అయితే వరలక్ష్మీకి ఇలాంటి పాత్ర చాలా కొత్త.అయినా కూడా అవలీలగా నటించింది.ఇక అరవింద్‌గా గణేష్, రాహుల్‌గా శశాంక్, సూర్య పాత్రలో మైమ్ గోపీ ( Mime Gopi )చక్కగా నటించారు.
మిగతా నటీనటులు కూడా ఎవరి పాత్ర మేరకు వారు బాగానే నటించారు.
టెక్నికల్:
కెమెరా వర్క్ బాగుంది.విజువల్‌గా చాలా బాగా తీశారు.మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉంది.
గోపీ సుందర్ తనదైన సంగీతంతో సినిమాకి ప్లస్ అయ్యారు.బీజీఎం మరింత ఆకట్టుకునేలా ఉంది.
ఎడిటింగ్ లోపాలు చాలా ఉన్నాయి.ఆ విషయంలో కేర్ తీసుకోవాల్సింది.
ఇక దర్శకుడు అనిల్ కాట్జ్ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో క్లారిటీ లేదు.డైలాగ్‌లు కూడా చాలా సింపుల్‌గా ఉన్నాయి.
చాలా లాజిక్స్ వదిలేశారు.థ్రిల్ ఎలిమెంట్లని బలంగా రాసుకోవాల్సింది.
విశ్లేషణ:
వరలక్ష్మి శరత్ కుమార్ సినిమాలో నటిస్తుందంటే ఆ సినిమాలో విషయం ఉన్నట్టే లెక్క అని చెప్పాలి.ఆమె నటించిన సినిమాలు అన్నీ కూడా హిట్ అయ్యాయి.
కథకు మంచి ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ వచ్చింది వరలక్ష్మి శరత్ కుమార్.ఒకటి రెండు తప్పచాలా వరకు హిట్లు ఉన్నాయి.
అలాంటిది ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తుందంటే, ఆమెనే సినిమాని లీడ్ చేస్తుందంటే ఆ సినిమాలో కంటెంట్ బాగా ఉన్నట్టే లెక్క.అయితే శబరి సినిమాలోనూ కంటెంట్ ఉంటుంది.
కానీ దర్శకుడు దాన్ని డీల్ చేయడంలో కొంత వరకు తడబాటు కనిపిస్తుంది.ఈ మూవీని సస్పెన్స్ థ్రిల్లర్‌గా తీసుకెళ్లాడు.
సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాల్లో ఆ థ్రిల్ ఎలిమెంట్లని బాగా రాసుకుని, రెండు మూడు ట్విస్ట్ లు ఉంటే, అవి పేలితే సినిమా హిట్టే.శబరి విషయంలోనూ అదే ఫార్ములాని వర్కౌట్ చేశారు.
అదిరిపోయే ట్విస్ట్ లు రెండు మూడు పెట్టి ఆడియెన్స్ ని ఎంగేజ్ చేసే ప్రయత్నం చేశారు.
ప్లస్ పాయింట్స్ :
నటి నటుల నటన, కథ.
మైనస్ పాయింట్స్ :
ఎడిటింగ్ లోపాలు, స్క్రీన్ ప్లే.
బాటమ్ లైన్:
శబరి సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో సాగే డిఫరెంట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ.ఈ మూవీని ఒకసారి చూడవచ్చు.
రేటింగ్
: 2.75/3