మధ్యప్రదేశ్‌లో గాడిదలకు గులాబ్ జామున్స్‌ తినిపించిన ప్రజలు.. ఎందుకో తెలిస్తే..

మన దేశంలో ప్రతి ప్రాంతానికి ప్రత్యేకమైన ఆచారాలు, నమ్మకాలు ఉంటాయి.వర్షం కోసం కూడా ఆచారాలను పాటిస్తుంటారు.

 Donkeys In Madhya Pradesh Given Gulab Jamuns For Rain God Video Viral Details, M-TeluguStop.com

అయితే ఇటీవల మధ్యప్రదేశ్‌లోని( Madhya Pradesh ) మందసౌర్ జిల్లాలో కొందరు ప్రజలు ఒక విచిత్రమైన ఆచారాన్ని పాటిస్తూ కనిపించారు.అక్కడి నవి తెగకు( Navi Tribe ) చెందిన ప్రజలు తమ ప్రాంతంలో వర్షం కురవాలని కోరుకున్నారు.

గాడిదలకు( Donkeys ) మొక్కి ఈ పని చేశారు అయితే వర్షాలు( Rains ) వారు కోరుకున్నట్లే కురుస్తున్నాయి.అందుకే ఇప్పుడు గాడిదలను పట్టుకుని వాటికి గులాబ్ జామూన్లు( Gulab Jamuns ) తినిపించారు.

అంతేకాదు, ఒక శ్మశానవాటిని గాడిదలతో దున్ని, అక్కడ విత్తనాలు విత్తారు.వారి నమ్మకం ప్రకారం, ఇలా చేస్తే వర్షం పంటలు బాగా పండేలాగా కురుస్తాయని నమ్ముతున్నారు.

ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వీడియోల్లో గాడిదలు గులాబ్ జామూన్లు తింటున్న దృశ్యాలు చూడొచ్చు.గత కొద్ది రోజులుగా మందసౌర్ జిల్లాలో వర్షాలు బాగా కురుస్తున్నాయి.గత ఈ ప్రాంతం వర్షంతో నిండిపోయింది.రానున్న రోజుల్లో కూడా బాగా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పారు.

వర్షం వల్ల పరిస్థితులు మెరుగుపడ్డాయి కాబట్టి, జిల్లా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.ఈ సంబరాలలో భాగంగా గాడిదలకు గులాబ్ జామూన్లు తినిపిస్తున్నారు.ఓ వీడియోలో రెండు గాడిదలు ఒక పెద్ద ప్లేట్‌లో ఉన్న గులాబ్ జామూన్లు తినడం చూడవచ్చు.

వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురవబోతున్నాయి.ముఖ్యంగా రాష్ట్రం తూర్పు భాగం, కొన్ని పశ్చిమ భాగాలలో ఎక్కువ వర్షం పడే అవకాశం ఉంది.

అయితే ఈ ఆచారానికి అర్థం లేదని కొంతమంది అంటున్నారు.దీని వెనకాల సైంటిఫిక్ రీజన్స్ లేవు కాబట్టి ఇవి చేయాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు.

ఏది ఏమైనా మోగ జంతువులకు మంచి స్వీట్ తినే అవకాశం లభించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube