శరత్ పౌర్ణిమ రోజు చంద్రుడిని చూస్తే ఏమవుతుందో తెలుసా..?

ముఖ్యంగా చెప్పాలంటే ఆశ్వాయుజ మాసంలో వచ్చే పూర్ణిమకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అని పండితులు చెబుతున్నారు.ఈ పౌర్ణమి రోజున శివ పూజ, లక్ష్మీదేవి పూజతో( Shiva Puja , Lakshmi Devi Puja ) విశేష ఫలితాలను పొందవచ్చు.

 Do You Know What Happens When You Look At The Moon On Sarat Purnima , Shiva Puja-TeluguStop.com

ఈ సంవత్సరం ఈ పౌర్ణమి అక్టోబర్ 28వ తేదీన శనివారం వస్తూ ఉంది.ఈ రోజున చంద్రుని అనుగ్రహం కోసం రవ్వ లడ్డులను పెరుగుతో తయారు చేసిన అన్నాన్ని సమర్పించాలని పండితులు చెబుతున్నారు.

ఈ రోజున చంద్ర పూజతో భక్తులకు అమృత వర్షం కురుస్తుందని చాలా మంది భక్తులు నమ్ముతారు.

Telugu Bhakti, Devotional, Sarat Purnima, Shiva Puja, Vishnu Puja-Telugu Bhakthi

ఆశ్వయుజ మాసంలో వచ్చే పూర్ణిమను శరత్ పూర్ణిమ ( Sarat Purnima )అని పిలుస్తారు.అంతేకాకుండా ఇదే రోజున లక్ష్మీదేవి సాగర మథనం నుంచి ఉద్భవించిందని, అందుకే ఈ మాసంలో వచ్చే పూర్ణిమ రోజున ఆమెను పూజించడం వల్ల అష్ట అష్టైశ్వర్యాలు లభిస్తాయని చెబుతున్నారు.అలాగే విష్ణువు పూజ ( Vishnu Puja )కూడా చేస్తే సకల ఐశ్వర్యలు సిద్ధిస్తుందని చెబుతున్నారు.

అంతే కాకుండా ఆశ్వయుజ మాసం పౌర్ణమి రోజున అమ్మ వారిని కూడా పూజించవచ్చు.ఈ రోజున లక్ష్మీ పూజ, లక్ష్మీ మంత్ర పఠనం శుభ ఫలితాలను ఇస్తుంది అని చెబుతున్నారు.

అంతే కాకుండా చంద్రుడు శ్రీలక్ష్మికి సోదరుడని శరత్ పూర్ణిమ రోజున మాత్రమే 16 కళలతో చంద్రుడు ప్రకాశిస్తాడని పండితులు చెబుతున్నారు.

Telugu Bhakti, Devotional, Sarat Purnima, Shiva Puja, Vishnu Puja-Telugu Bhakthi

ఈ రోజున చంద్రకిరణాలకు విశేషమైన శక్తి ఉందని చెబుతున్నారు.అవి శరీరక, మానసిక రుగ్మతలను దూరం చేస్తాయని చాలా మంది భక్తులు నమ్ముతున్నారు.అంతే కాకుండా వెన్నెలకు పెట్టే పెరుగన్నం చంద్ర కిరణాల్లో ఉన్న ఔషధాన్ని స్వీకరిస్తుందని చెబుతున్నారు.

దానిని మనం తీసుకున్నప్పుడు శరీరంలోని వ్యాధులు దూరం అవుతాయని చెబుతున్నారు.అలాగే శరత్ పూర్ణిమ రోజున చంద్రుడిని చూస్తే కంటి చూపు మెరుగుపడుతుందని చెబుతున్నారు.

ఈ పౌర్ణమి రోజున రాత్రి లక్ష్మీ పూజ చేస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయని భక్తులు నమ్ముతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube