ప్రపంచంలో జీవిస్తున్న ప్రజలకు డబ్బు అవసరం ఎప్పుడూ ఏ విధంగా వస్తుందో ఎవరు ఊహించలేరు.ఆ సమయంలో మన దగ్గర డబ్బులు ఉంటే పర్వాలేదు కానీ, లేకపోతే అప్పు చేయవలసి వస్తుంది.
తర్వాత అప్పును తీర్చడానికి చాలా కష్టపడవలసి వస్తుంది.అయితే కొంత మంది ఎంత సంపాదించినా అప్పులను తీర్చలేక పోతుంటారు.
దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి.అందులో కొన్ని ఇంట్లో చేసే పొరపాట్లు కూడా ఉన్నాయి.
మరి ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.జ్యోతిష్య శాస్త్రం( Astrology ) ప్రకారం కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదు.
ఇంట్లో ఖాళీ పాత్రలను ఎప్పుడు స్టవ్ పై పెట్టకూడదు.మీరు బయట నుంచి వచ్చి డోర్ బెల్ కొట్టక కొంత సమయం వేచి ఉండండి.
కాలుతో డోర్ ను తన్నడం లాంటివి అస్సలు చేయకూడదు.ఇంటి ప్రధాన ద్వారం వద్ద కూర్చుని ఎప్పుడు ఆహారం తినకూడదు.
లక్ష్మీదేవి ఈ గుమ్మం నుంచి మాత్రమే ఇంట్లోకి ప్రవేశిస్తుందని గుర్తుపెట్టుకోవాలి.అలాగే ఉదయం, సాయంత్రం ఆహారాన్ని వండిన తర్వాత మొదటగా ఆవుకి పెట్టాలి.
గౌరవప్రదంగా దానికి తినిపించడం వల్ల లక్ష్మీదేవి( Lakshmi Devi ) అనుగ్రహం లభిస్తుంది.

అలాగే ప్రతి రోజు ఉదయాన్నే ఇంటి పెద్దలకు నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకోవాలి.ముఖ్యంగా చెప్పాలంటే ఉదయం, సాయంత్రం భగవంతుని పూజించి హారతి తీసుకుంటే ఐశ్వర్యం పెరుగుతుంది.ఇంటిని శుభ్రం చేయడానికి ఉంచిన చీపురు ను బయట నుంచి వచ్చే వారికి కనిపించని ప్రదేశంలో ఉంచాలి.
అంతే కాకుండా చీపురు( Broom )ను ఎప్పుడు కాళ్లతో తోక్కకూడదు.ఎందుకంటే చీపురును లక్ష్మీదేవి చిహ్నంగా భావిస్తారు.

రాత్రి వంట చేసిన తర్వాత కిచెన్( kitchen ) లో ఎప్పుడూ తిన్న, వండిన పాత్రలను అలాగే ఉంచకూడదు.అలాగే గ్యాస్ స్టవ్ ను శుభ్రం చేయడంతో పాటు వంట గదిని శుభ్రం చేసిన తర్వాత మాత్రమే నిద్రపోవాలి.ఈ పనులు అన్నిటినీ చేయడం వల్ల ఎన్నో రోజులుగా ఉన్న అప్పుల నుంచి కూడా బయటపడవచ్చు.