శరీరానికి ఉత్తమ గుణాలను కల్గించే స్నానాల గురించి తెలుసా?

మన హిందూ సంప్రదాయాల ప్రకారం మనం చేసే స్నానాల వల్ల కూడూ మనం ఉత్తమ  గుణాలు పొందవచ్చట.అయితే అవేంటో చాలా మందికి తెలియదు.

 Do You Know About The Baths That Give The Best Properties To The Body , Devotion-TeluguStop.com

గౌణ స్నానం.అంటే శరీరానికి ఉత్తమ గుణాలను కల్గించే స్నానం గురించి మనం ఇప్పుడు తెలుసు కుందాం.

అలాగే అవి ఎన్ని రకాలు అవేంటో కూడా తెలుసుకుందాం.

గౌణ స్నానం మొత్తం ఏడు రకాలు.

అందులో మొదటిది మంత్ర స్నానం.అంటే ఆబ్లింగ మంత్రాలు చదువుతూ నీటిని శరీరంపై ప్రోక్షించుకోవడం.

దీన్నే బ్రహ్మ స్నానం అని కూడా పిలుస్తారు.అలాగే రెండోది భౌమము – పుట్ట మట్టి లేదా రేగడి మట్టిని శరీరం అంతటా పూసుకోవడాన్ని భౌమ స్నానం అంటారు.

దీన్నే పార్థివం మృత్తికా స్నానం అని కూడా అంటారు.మూడోది ఆగ్నేయము – అగ్ని కుండములోని భస్మాన్ని శరీరానికి రాసుకోవడాన్ని ఆగ్నేయ స్నానం అంటారు.

నాలుగోది వాయువ్యం… గోధూళి శరీరంపై పడటాన్ని వాయువ్య స్నానం అంటారు.ఐదోది దివ్యం… సూర్య కిరణ స్పర్శచే ఏర్పడుతుంది.

ఆరోది వారుణం… వర్షంలో తడవటాన్ని లేదా నీటిలో మునగటాన్ని వారణ స్నానం అంటారు.ఏడోది మానసము.

దైవమును ఏకాగ్రతతో ధ్యానిస్తూ… ప్రశాంతంగా ఉండటాన్నే మానస స్నానం అంటారు.దీన్నే యౌగికం అని కూడా అంటారు.

అయితే పైన చెప్పినటు వంటి స్నానాలు చేయడం వల్ల మానవ శరీరం ఉత్తమ గుణాలను పొందు తుందని మన పురాణాలు చెబుతున్నాయి.అందుకే అప్పుడప్పుడు మీరు కూడా ఇలాంటి స్నానాలు ఆచరిస్తూ ఉండండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube