ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే... పౌర్ణమి వరకు చంద్రునికి ఈ నైవేద్యం సమర్పిస్తే..?

ప్రపంచంలో నివసించేటటువంటి ప్రతి వ్యక్తికి ఏదో ఒక విషయంలో సమస్యలు తలెత్తుతుంటాయి.అయితే ప్రతి ఒక్కరూ వారికి వచ్చిన కష్టాల నుంచి గట్టెక్కాలంటే దేవతలను ప్రార్థించడం మనం చూస్తూనే ఉంటాం.

 If You Want To Get Rid Of Financial Difficulties What If This Offering Is Offere-TeluguStop.com

కొందరికి ఆరోగ్య సమస్యలు వెంటాడితే మరికొందరికి ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతుంటాయి.ఈ విధంగా ఆర్ధిక ఇబ్బందులతో బాధపడే వారు ఆ చంద్రునికి పూజించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధనవంతులు అవుతారని పండితులు చెబుతున్నారు.

అయితే చంద్రునికి ఏ విధంగా పూజ చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయో ఇక్కడ తెలుసుకుందాం.

మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే అష్టమి నుంచి పౌర్ణమి వరకు ఆ చంద్ర దేవుడికి పెరుగన్నం నైవేద్యంగా సమర్పించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి.

అష్టమి నుంచి పౌర్ణమి వరకు ప్రతిరోజు సాయంత్రం ఎంగిలి కాని అన్నం పెరుగు కలిపి ఆ చంద్రునికి అరటి ఆకులో నైవేద్యంగా సమర్పించాలి.వీలైనంతవరకు నైవేద్యం అరటి ఆకులో పెట్టడం వల్ల ఉత్తమ ఫలితాలు కనబడతాయి.

అరటి ఆకు లేకపోతే వెండి గిన్నెలో స్వామివారికి నైవేద్యం సమర్పించాలి.అదేవిధంగా నిరుపేదలకు నీలి రంగు వస్త్రాలను దానం చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది.

ముఖ్యంగా పౌర్ణమి రోజు చంద్రునికి ఎంత నైవేద్యం సమర్పించి ఉంటారో ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి.మరి ఏ ఇతర ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉండాలి.సాధారణంగా చంద్రుని ప్రారబ్ధానికి దేవత.కనుక చంద్రునికి నైవేద్యం పెట్టడం ద్వారా సంతృప్తి చెంది సకల సంపదలను కలిగిస్తాడు.

ప్రతి రోజు దేవుడికి నైవేద్యం సమర్పించేటప్పుడు కిటికీలో నుంచి లేదా ఇంటి పైకప్పు నుంచి ఆ చంద్రుడిని చూస్తూ స్వామివారికి నైవేద్యం సమర్పించాలి.ఈ విధంగా చేయటం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube