రైల్వే స్టేషన్‌లో స్టంట్ చేస్తూ ఒక కాలు, ఒక చేయి పోగొట్టుకున్న యువకుడు..

చాలామంది సోషల్ మీడియా( Social media )లో లైక్స్ పొందాలని లేదంటే థ్రిల్‌ను అనుభవించాలని డేంజరస్ స్టెంట్ చేస్తున్నారు.ఈ చిన్న వాటి కోసం వారు ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నారు.

 A Young Man Lost One Leg And One Arm Doing A Stunt At The Railway Station , Wad-TeluguStop.com

ఇటీవల ముంబైలోని సెవ్రి రైల్వే స్టేషన్‌లో ప్రమాదకరమైన స్టంట్ చేస్తూ ఒక యువకుడు షాక్ ఇచ్చాడు.అతడి స్టంట్ కి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఆ యువకుడి పేరు ఫర్హాత్ అజామ్ షేక్( Farhat Azam Shaikh ) అని తెలిసింది.ఇతడు ముంబైలోని వాడాలా నివాసి.

అతడు మార్చి 7న ఓ స్టంట్‌ను బాగానే పర్ఫార్మ్ చేయగలిగాడు.

అయితే ఏప్రిల్ 14న మసీద్ వద్ద మరో స్టంట్ చేసేటప్పుడు అతను తీవ్రంగా గాయపడ్డాడు.ఈ ప్రమాదంలో అతని ఎడమ చేయి, కాలు కోల్పోయాడు.ప్రస్తుతం అతను చాలా విషమ పరిస్థితిలో ఉన్నందున ఆసుపత్రి పాలై ఉన్నాడు.

అతని ఆరోగ్య పరిస్థితిని బట్టి అతన్ని అరెస్ట్ చేయలేకపోయామని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్( Railway Protection Force ) అధికారి శుక్రవారం తెలిపారు.అయితే ఈ ఘటనలో గాయపడిన అజామ్ ఒక వీడియో రిలీజ్ చేశాడు.

ఎవరూ కూడా తన లాగా స్టంట్స్‌ చేయవద్దని, తన కాలువ చేయి పోవడం వల్ల ఆ రోజువారీ పనులు చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నానని, ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదని వాపోయాడు.v

ఈ స్టంట్స్‌ ఇల్లీగల్ మాత్రమే కాకుండా ఒకరి ప్రాణాలను కూడా తీసేస్తాయని హెచ్చరించాడు.మరోవైపు జులై 14న ట్విట్టర్‌లో ఒక వీడియో పోస్ట్ చేస్తూ ప్రమాదకర స్టంట్లు చేయవద్దని సెంట్రల్ రైల్వే హెచ్చరిక జారీ చేసింది.ఈ వీడియోలో అజామ్ కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తూ ప్రమాదకరమైన స్టంట్ చేస్తున్నాడు.

దీంతో రైల్వే అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు.వీడియో గురించి తెలిసికొన్న వెంటనే, వాడాలా రోడ్డు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అనే సంస్థ అజామ్ పై కేసు నమోదు చేసింది.

ఆ వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది.తర్వాత ఆ వ్యక్తిని వాడాలాలోని అంథోప్ హిల్‌లోని అతని ఇంటి వద్ద పట్టుకున్నారు.

అతని పేరు ఫర్హాత్ అజామ్ షేక్ అని తెలిసింది.అతన్ని ప్రశ్నించగా, మార్చి 7న సెవ్రి స్టేషన్‌లో సీఎస్ఎంటీ బౌండ్ రైలులో ఈ స్టంట్ చేసినట్లు ఒప్పుకున్నాడు.

తన స్నేహితుడితో వీడియో తీయించి సోషల్ మీడియాలో పెట్టించాలనే ఉద్దేశంతో ఈ స్టంట్ చేసినట్లు చెప్పాడు.కానీ చివరికి జీవితం నాశనం అయిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube