టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున( Nagarjuna ) సాధారణంగా ఒక్కో సినిమాకు 15 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటారు.నా సామిరంగ సినిమాకు సైతం నాగ్ పరిమితంగా పారితోషికం తీసుకున్నారని తెలుస్తోంది.
అయితే కూలీ సినిమాలో నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.లోకేశ్ కనగరాజ్( Lokesh Kanagaraj ) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.
కూలీ సినిమా పాన్ ఇండియా సినిమా కావడం నాగార్జునకు పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ఉండటం, నాగ్ పోషిస్తున్న పాత్ర నెగిటివ్ రోల్ కావడంతో కూలీ సినిమాకు నాగ్ దాదాపుగా రెట్టింపు రెమ్యునరేషన్ ను అందుకోనున్నారు.భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేయడం, కథ అద్భుతంగా ఉండటంతో నాగార్జున ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది.
ఈ మధ్య కాలంలో సీనియర్ హీరోల పారితోషికం అంతకంతకూ పెరుగుతుండగా నాగార్జున సైతం మార్కెట్ కు అనుగుణంగా రెమ్యునరేషన్ తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.డిమాండ్ ఉన్నప్పుడే క్రేజ్ ను ఉపయోగించుకోవడంలో నాగార్జునకు ఎవరూ సాటిరారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.నాగ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
స్టార్ హీరో నాగార్జున కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు.నాగ్ వయస్సు ప్రస్తుతం 65 సంవత్సరాలు కాగా ఈ వయస్సులో కూడా నాగ్ లుక్స్ విషయంలో ఎంతో కేర్ తీసుకుంటూ అభిమానులకు అంతకంతకూ దగ్గరవుతున్నారు.నాగార్జున రేంజ్ అంతకంతకూ పెరగాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
నాగార్జున భాషతో సంబంధం లేకుండా కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.నాగార్జున మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ ( Big Boss )షోతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ఈ షోపై ప్రేక్షకుల్లో అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.నాగ్ త్వరలో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారు.