అనుమతులు లేకుండా డీజేలు నడిపిస్తే కఠిన చర్యలు తప్పవు

నిబంధనలు విరుద్ధంగా డీ.జే నడుపుతూ పోలీస్ విధులకు ఆటంకం కలిగిస్తూ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన ముగ్గురిపై కేసు నమోదు.

 Strict Action Will Be Taken If Djs Operate Without Permits, Strict Action , Gov-TeluguStop.com

పోలీస్ విధులకు ఆటంకం కలిగించిన , ప్రభుత్వ ఆస్తులు( Government assets) ధ్వంసం చేసిన ఉపేక్షించేది లేదు.సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి.

ఈ సందర్భంగా డిఎస్పీ( Sirisilla DSP Chandrasekhar Reddy ) మాట్లాడుతూ….సిరిసిల్ల పరిధిలోని పెద్దూర్ లోని డబుల్ బెడ్ రూమ్స్ వద్ద నిబంధనలకు విరుద్ధంగా డిజేను రోడ్డు అడ్డంగా పెట్టుకొని ప్రజలకు ప్రజలకు ఇబ్బందులు కలుగచేస్తున్నారని డయల్100 కాల్ రాగానే అక్కడికి వెళ్లిన బ్లూ కోల్ట్ సిబ్బంది డి.జే ఆపమని చెప్పగా ఆపకుండా దొంతరవేణి నవీన్,దొంతర వేణి మల్లేష్, దొంతర వేణి రంజిత్ అను వారు పోలీస్ విధులకు ఆటంకం కలిగిస్తూ డయల్100 ట్యాబ్ ధ్వంసం చేయగా బ్లూ కోల్ట్ సిబ్బంది పిర్యాదు మేరకు డి.జే సీజ్ చేసి నవీన్, మల్లేష్, రంజిత్ లను లపై కేసు నమోదు చేసి ఈ రోజు వారిని రిమాండ్ కి తరలించడం జరిగిందని డిఎస్పీ తెలిపారు.

సిరిసిల్ల ప్రజలకు విజ్ఞప్తి.నిబంధనలకు విరుద్ధంగా డి.జే లు నిర్వహించిన రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో డీజేలను పెట్టి ప్రజలకు ఇబ్బంది కలిగించిన డి.జే యజమానులతో ఓటుగా నిర్వహకులపై కఠినచర్యలు తీసుకోవడంజరుగుతుందని,గతంలో బైండోవర్ అయిన వ్యక్తులు మళ్లీ డి.జే లు నడుపుతూ రోడ్లపై అనవసరంగా న్యూసెన్స్ చేస్తే తహసిల్దారు ముందు బైండోవర్ చేసి ఫోర్ ఫీట్ చేయించి జైలుకు పంపించడం జరుగుతుందని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube