సరిపోదా శనివారం మూవీ ఫస్ట్ డే కలెక్షన్ల లెక్కలివే.. నాని మూవీకి ఎంతంటే?

నాని వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో తెరకెక్కిన సరిపోదా శనివారం( Saripodhaa Sanivaaram) మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో ప్రదర్శితం అవుతున్న సంగతి తెలిసిందే.గురువారం రోజున థియేటర్లలో విడుదలైనా ఈ సినిమా కలెక్షన్ల విషయంలో మాత్రం అదరగొడుతోంది.ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 8.75 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు వచ్చాయని సమాచారం అందుతోంది.ఓవర్సీస్ లో ఈ సినిమాకు 8 లక్షల 50 వేల డాలర్ల కలెక్షన్లు వచ్చినట్టు తెలుస్తోంది.

 Saripoda Sahnivaram Movie First Day Collections Details Inside Goes Viral In So-TeluguStop.com

సరిపోదా శనివారం మూవీ ఈ మధ్య కాలంలో విడుదలైన చాలా సినిమాలతో పోల్చి చూస్తే బెటర్ కలెక్షన్లను సాధించింది.45 కోట్ల రూపాయల టార్గెట్ తో విడుదలైన ఈ సినిమా తొలిరోజే 20 శాతం కలెక్షన్లను సాధించింది. ఫస్ట్ వీకెండ్ సమయానికే 50 శాతానికి పైగా కలెక్షన్లతో ఈ సినిమా అదరగొట్టడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

సరిపోదా శనివారం మూవీ నిడివి తగ్గిస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

నిడివి తగ్గింపు విషయంలో మేకర్స్ నిర్ణయం ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది.నిడివి తగ్గిస్తే ఈ సినిమా రేంజ్ మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.ఈ సినిమా సక్సెస్ తో ప్రియాంక అరుల్ మోహన్ ( Priyanka Mohan )కు సైతం మంచి పేరు వచ్చింది.

సరిపోదా శనివారం సినిమాలో ఎస్జే సూర్య పర్ఫామెన్స్ కు మాత్రం ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.ఈ సినిమా ఫుల్ రన్ లో ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

సరిపోదా శనివారం సినిమాకు సీక్వెల్ సైతం తెరకెక్కే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది.ఈ సినిమా సీక్వెల్ పై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.నాని ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లా సరిపోదా శనివారం సినిమా ఉందని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube