పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ వివాదం పై స్పందించిన పూనమ్.. బన్నీకి పూర్తి మద్దతు!

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం అల్లు వర్సెస్ మెగా వివాదం నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ రెండు కుటుంబాల మధ్య ఎప్పటినుంచో వివాదాలు ఉన్నప్పటికీ ఏపీ ఎన్నికల సమయంలో ఈ వివాదాలు తారా స్థాయికి చేరుకున్నాయి.

 Poonam Kaur Share Sensational Post On Allu Arjun And Pawan Kalyan Controversy De-TeluguStop.com

ముఖ్యంగా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కి సపోర్ట్ చేయకుండా అల్లు అర్జున్( Allu Arjun ) తన స్నేహితుడు వైకాపా నాయకుడికి మద్దతు తెలపడం కోసం ఎప్పుడైతే నంద్యాల వెళ్లారో అప్పుడు నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

ఇప్పటివరకు ఈ వివాదం గురించి పరోక్షంగా మాట్లాడిన ప్రస్తుతం మాత్రం మీడియా ముందుకు వచ్చి ఏకంగా అల్లు అర్జున్ పై జనసేన ఎమ్మెల్యేలు మెగా హీరోలు కూడా విమర్శలు చేస్తుండడం మనం చూస్తున్నాము.ఇలా ఈ రెండు కుటుంబాల మధ్య రోజు రోజుకు వివాదాలు ముదిరిపోతున్నాయి.ఇటీవల జనసేన ఎమ్మెల్యేలు కూడా అల్లు అర్జున్ పై విమర్శలు చేశారు.

అల్లు అర్జున్ కి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేంత అర్హత లేదని, స్థాయి మరిచి మాట్లాడుతున్నారని, అల్లు అర్జున్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు కాళ్లు పట్టుకోవాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇలా ఈ రెండు కుటుంబాల మధ్య వివాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వివాదంపై నటి పూనమ్ కవూర్( Poonam Kaur ) స్పందించారు.ఎప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక వివాదాస్పద పోస్ట్ చేసే ఈమె పరోక్షంగా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి సెటైర్స్ వేస్తూ కామెంట్లు చేస్తూ ఉంటారు.ఇక తాజాగా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ వివాదం పై ఈమె స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.

ఇందులో భాగంగా అల్లు అర్జున్ స్నేహ రెడ్డి( Sneha Reddy ) తో పూనమ్ ఉన్న ఫోటోని షేర్ చేస్తూ.ప్రేమ, ప్రార్ధనలు, శాంతి… అని ఆ ఫోటోకి కామెంట్ జోడించింది.

పూనమ్ కౌర్ ఈ పోస్ట్ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటనే ఆలోచనలో పడ్డారు.  అయితే ఈమె పూర్తిగా తన మద్దతు బన్నీకే తెలిపిందని స్పష్టంగా అర్థం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube