సమ్మర్ సీజన్ రానే వచ్చింది.ఎండలు రోజురోజుకు పెరిగి పోతున్నాయి.
అయితే ఈ సీజన్‌లో ఆరోగ్యాన్ని, చర్మాన్ని సంరక్షించుకోవాలంటే ఖచ్చితంగా కొన్ని కొన్ని ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోవాలి.అటువంటి వాటిల్లో ఐస్ ఆపిల్ ఒకటి.
అదేనండీ తాటి ముంజలు.గ్రామాల్లో విరి విరిగా లభ్యమయ్యే తాటి ముంజలు రుచిగా ఉండటమే కాదు.
బోలెడన్ని పోషకాలనూ కలిగి ఉంటాయి.అందుకే ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి.
ముఖ్యంగా సమ్మర్ సీజన్‌లో ప్రతి రోజు తాటి ముంజలు తింటే.ఇక మీ ఆరోగ్యానికి తిరుగుండదు.
ప్రతి సంవత్సరం వేసవి కాలంలో వడదెబ్బకు గురవుతూ ఎందరో ప్రాణాలను విడుస్తున్నారు.అయితే వడదెబ్బ నుంచి మనల్ని రక్షించడంలో ఐస్ ఆపిల్ అద్భుతంగా సహాయపడుతుంది.రోజూ ఐస్ ఆపిల్‌ను తింటే.శరీరం కూల్‌గా మారుతుంది.
వేసవి వేడిని తట్టుకునే శక్తి లభిస్తుంది.తద్వారా వడదెబ్బకు దూరంగా ఉండొచ్చు.
అలాగే వేసవిలో పిల్లల నుంచి పెద్దల వరకు ఎదుర్కొనే సమస్య డీహైడ్రేషన్.ఈ సమస్యకూ ఐస్ ఆపిల్ చెక్ పెట్టగలదు.పోషకాలతో పాటు ఐస్ ఆపిల్‌లో వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది.అందుకే వీటిని తరచూ తీసుకుంటే శరీరంలో నీటి స్థాయిలో పడిపోకుండా ఉంటాయి.

చాలా మంది బరువు తగ్గడం కోసం నానా ప్రయత్నాలు చేస్తుంటారు.అలాంటి వారికి కూడా ఇవి ఉపయోగపడుతాయి.ఐస్ ఆపిల్‌ను తినడం వల్ల మరింత వేగంగా వెయిట్ లాస్ అవుతారు.అంతేకాదు, సమ్మర్‌లో ఐస్ ఆపిల్‌ను డైట్‌లో చేర్చుకోవడం వల్ల నీరసం, అలసట వంటివి దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.
బ్యాడ్ కొలెస్ట్రాల్ కరుగుతుంది.జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారుతుంది.రక్తపోటు స్థాయిలు అదుపులో ఉంటాయి.కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం సమస్యలు దూరం అవుతాయి.మరియు చర్మం ఎల్లప్పుడూ కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది.కాబట్టి, తాటి ముంజలు కనిపిస్తే వాటిని అస్సలు వదిలిపెట్టకండి.