పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ( Prabhas ) ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.ఇక ఈయన ఇటీవల కల్కి సినిమా( Kalki Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ తన తదుపరి సినిమాల షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ఈయన కల్కి 2, రాజా సాబ్, స్పిరిట్, సలార్ 2, ఫౌజీ వంటి వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమాలన్నీ కూడా షూటింగ్ పనులను జరుపుకుంటున్నాయి.ఇక త్వరలోనే మారుతి డైరెక్షన్లో ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్( Raja Saab ) సినిమా విడుదల కాబోతుందని తెలుస్తోంది.తాజాగా ఈ సినిమా నిర్మాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ప్రభాస్ సినిమా గురించి కొన్ని విషయాలను వెల్లడించారు.అతి తక్కువ సమయంలో తమ బ్యానర్ లో 100 సినిమాలు చేయాలన్నదే తమ బ్యానర్ లక్ష్యమని ఈయన తెలిపారు.

ఇక ఇందులో భాగంగా ఇటీవల చేసిన కొన్ని పెద్ద సినిమాలు పూర్తిగా నష్టాలను తీసుకువచ్చాయని తెలిపారు.అయితే ఈ నష్టాలు అన్నింటిని కూడా ప్రభాస్ రాజా సాబ్ సినిమా కవర్ చేస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.ఇక ఈ సినిమాని ఏప్రిల్ నెలలో విడుదల చేయబోతున్నట్లు కూడా ఈయన వెల్లడించారు.
ఈ విధంగా రాజా సాబ్ సినిమా ఏప్రిల్ లో విడుదల కాబోతుందని వెల్లడించార. కానీ సరైన తేదీని మాత్రం వెల్లడించలేదు.ఇకపోతే ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా మారిపోయారు.ఇక ఈ సినిమా సీక్వెల్ చిత్రమైన బాహుబలి 2 ఏప్రిల్ 28, 2017 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇక ఇదే సెంటిమెంట్ ను విశ్వప్రసాద్ రాజా సాబ్ విషయంలో కూడా ఫాలో అవుతున్నారని తెలుస్తోంది.మరి ఆ హిట్ సెంటిమెంట్ ఇక్కడ కలిసి వస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.