గోల్డెన్ గ్లో స్కిన్ కోసం చాలా మంది మగువలు ఆరాటపడుతుంటారు.అందులోనూ ఏదైనా ఫంక్షన్ లేదా పెళ్లి ఉందంటే అటువంటి చర్మాన్ని పొందడం కోసం వేలకు వేలు ఖర్చు పెట్టి ఫేషియల్ చేయించుకుంటారు.
కానీ ఫేషియల్ అక్కర్లేదు.ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను పాటిస్తే పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే సహజంగా గోల్డెన్ గ్లో స్కిన్ ను తమ సొంతం చేసుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కా ఏంటో ఓ చూపు చూసేయండి.
ముందుగా ఒక బౌల్ ను తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పు పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్, రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, హాఫ్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ మరియు మూడు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్ వేసుకుని అన్నీ కలిసేంత వరకు స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు కాస్త మందంగా అప్లై చేసుకోవాలి ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ సింపుల్ చిట్కాను కనుక పాటిస్తే ఎలాంటి ఫేషియల్ అక్కర్లేదు.
సహజంగానే మీ స్కిన్ గోల్డెన్ గ్లో గా మెరిసిపోతుంది.
అంతేకాదు ఈ సింపుల్ చిట్కాను పాటించడం వల్ల స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.ముదురు రంగు మచ్చలు ఉంటే క్రమంగా మాయం అవుతాయి.బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.
ముఖ చర్మం ఆకర్షణీయంగా మెరిసిపోతుంది.కాబట్టి వేలకు వేలు ఖర్చుపెట్టి ఫేషియల్ చేయించుకునే బదులుగా ఇంట్లోనే ఖర్చు లేకుండా ఈ సింపుల్ ఫేస్ ప్యాక్ ను వేసుకుంటే అందంగా మెరిసిపోతారు.