హీరో నాని దర్శకుడు కావాలనే సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు.కానీ అనుకోకుండా స్టార్ హీరో అయిపోయాడు.
నాని చాలా మంచి కథలతో సినిమాలు తీస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నాడు.యంగ్ హీరోలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.
ప్యూర్ టాలెంట్, హార్డ్‌వర్క్‌తో స్టార్ హీరోగా ఎదిగాడు నాని.ఎదగడం మాత్రమే కాదు ఇండస్ట్రీకి చాలామంది ప్రతిభవంతులైన దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ “అష్టా చెమ్మా”తో నాని హీరో పరిచయం అయ్యాడు.అప్పటినుంచి 15 ఏళ్లుగా చాలామంది దర్శకులు పరిచయం చేశాడు.
వారిలో టాప్ 10 దర్శకుల గురించి తెలుసుకుందాం.
శ్రీకాంత్ ఓదెల
:
నేచురల్ స్టార్ నాని కొత్త టాలెంట్‌ను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తాడు.అందులో భాగంగా శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చాడు.వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా పేరు దసరా.ఇందులో నాని హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించారు.ఈ సినిమాతో శ్రీకాంత్ మంచి హిట్ సాధించాడు.
నాగ్ అశ్విన్
నాని, విజయ్ దేవరకొండ నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’( Yevade Subramanyam ) సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.నాగ్ అశ్విన్(Nag Ashwin) ఈ సినిమాతోనే ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.
అంజనా అలీ ఖాన్
నిత్య మీనన్, నాని హీరో హీరోయిన్లుగా నటించిన తమిళ మూవీ “వెప్పం’.దీన్ని తెలుగులో ‘సెగ’ టైటిల్ తో విడుదల చేశారు.
అంజనా అలీ ఖాన్ దీనిని డైరెక్ట్ చేసింది.ఇదే మూవీ ఆమెకు ఫస్ట్ మూవీ.
నందిని రెడ్డి
టాలెంటెడ్ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డిని కూడా నానినే పరిచయం చేశాడంటే నమ్ముతారా? వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన “అలా మొదలైంది” సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.
•
తాతినేని సత్య
భీమిలి కబడ్డీ( Bheemili Kabaddi Jattu ) జట్టు మూవీ ఒక ఎవర్ గ్రీన్ హిట్ అని చెప్పుకోవచ్చు.తాతినేని సత్య డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నాని చాలా బాగా నటించాడు.ఇదే మొదటి సినిమా.
దీనివల్ల బాగా పేరు కూడా వచ్చింది.
•
శివ నిర్వాణ
నాని, నివేదా థామస్, ఆది పినిశెట్టి యాక్ట్ చేసిన “నిన్ను కోరి” మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఇందులోని పాటలు మస్త్ ఉంటాయి.నాని నివేదా మధ్య సీన్లు కూడా చాలామందిని ఆకట్టుకుంటాయి.దీనికి దర్శకుడు శివ నిర్వాణ.
ఇదే అతనికి తొలి మూవీ.
•
శౌర్యువ్
ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా “హాయ్ నాన్న” చాలామంది హృదయాలను తాకింది.
ఈ సినిమాతో మరో కొత్త దర్శకుడిని పరిచయం చేశాడు నాని.ఆయన పేరు శౌర్యువ్.
శౌర్యువ్ ఈ మూవీతో ఇండస్ట్రీకి కావడం మాత్రమే కాదు చాలా ఫేమస్ అయ్యాడు
•
గోకుల్ కృష్ణ
నాని, వాణి కపూర్ తారాగణంతో తెరకెక్కిన మూవీ “ఆహా కళ్యాణం“.దీనితో నాని గోకుల్ కృష్ణను దర్శకుడిగా పరిచయం చేశాడు.
•
ప్రశాంత్ వర్మ
హనుమాన్ మూవీతో హండ్రెడ్ క్రోర్ క్లబ్ లో చేరిన ప్రశాంత్ వర్మను లాంచ్ చేసింది కూడా నానినే.అ! సినిమాతో ప్రశాంత్ వర్మ ( Prasanth Varma )ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యాడు.దీనిని నాని నిర్మించాడు.
శైలేష్ కొలను
హిట్ మూవీ సిరీస్ తో శైలేష్ కొలను స్టార్ డైరెక్టర్ అయిపోయాడు.ఈ చిత్రాలకు నానినే నిర్మాత.