పవన్ కళ్యాణ్ హోస్ట్ గా భారీ రియాలిటీ షో.. అలా మిస్ అయ్యిందా?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ఒకరు.మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా ఈయన ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తనకంటూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు.

 Pawan Kalyan Misses Hosting Major Reality Show On Etv, Pawan Kalyan, Ramoji Rao,-TeluguStop.com

తన నటన ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయాల( Politics ) పై ఆసక్తితో రాజకీయాలలోకి అడుగుపెట్టారు.ఇలా జనసేన పార్టీని స్థాపించిన ఈయన 10 సంవత్సరాల పాటు రాజకీయాలలో ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ ప్రస్తుతం రాజకీయాలలో కూడా సక్సెస్ అందుకున్నారు.

Telugu Janasena, Pawan Kalyan, Ramoji Rao, Tollywood-Movie

ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా అలాగే ఇతర శాఖలకు మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉండగా తాజాగా పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా గుర్తింపు సంపాదించుకున్న వారందరూ కూడా ఎన్నో టాక్ షోలకు ఈ యాంకర్లుగా వ్యవహరిస్తూ మంచి సక్సెస్ అందుకున్నారు.అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఒక రియాలిటీ షో కి హోస్టుగా వ్యవహరించాల్సి ఉండేదట కానీ అది మిస్ అయిందని తెలుస్తోంది.

Telugu Janasena, Pawan Kalyan, Ramoji Rao, Tollywood-Movie

రామోజీరావు ( Ramoji Rao ) ఆధ్వర్యంలో ఒక భారీ రియాలిటీ షోని ప్లాన్ చేశార.  ఆ రియాలిటీ షో కి పవన్ కళ్యాణ్ పోస్ట్ అయితే బాగుంటుందని రామోజీరావు భావించి ఆయన ఆలోచనను పవన్ కళ్యాణ్ తో పంచుకున్నారు  ఇక పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరించడానికి దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కానీ ఈ కార్యక్రమం కొన్ని కారణాలవల్ల ఆలస్యం కావడం అంతలోపే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి రాజకీయాల వైపు రావడంతో ఈ షో మిస్ అయిందని తెలుస్తోంది.మరి పవన్ హోస్ట్ గా చేయాల్సిన ఆ షో ఏంటి అనే విషయానికి వస్తే అది మరేదో కాదు.

జనాలలో భారీ స్పందన సాధించిన సత్యమేవ జయతే ప్రోగ్రామ్ ను తెలుగులో పవన్ కళ్యాణ్ తో చేయించాలని రామోజీరావు భావించినట్టు తెలుస్తోంది.అలా పవన్ హోస్ట్ గా ఓ రియాలిటీ షో మిస్ అయిందని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube