సాధారణంగా స్టార్ హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టగానే ఫిమేల్ లీడ్ రోల్ అందుకోలేరు.మొదటగా ఏదో ఒక క్యారెక్టర్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెడతారు.
తర్వాత టాలెంట్, అభినయంతో హీరోయిన్ రేంజ్‌కు ఎదుగుతుంటారు.కొందరికి ఫస్ట్ సినిమాతోనే హీరోయిన్ అయ్యే ఛాన్స్ వస్తుందేమో కానీ మిగతా వారికి హీరోయిన్‌గా లాంచ్ కావడానికి కొద్దిగా సమయం పడుతుంది.
టాలీవుడ్‌లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్, సైడ్ క్యారెక్టర్లు చేసిన అగ్ర హీరోయిన్లు కొందరు ఉన్నారు.వారెవరో తెలుసుకుందాం.
శ్రీలీల

స్టార్ హీరోయిన్ శ్రీలీల చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ని ప్రారంభించింది.చిత్రాంగద (2017) సినిమాలో షాలినీ దేవిగా శ్రీలీల( Sreeleela ) నటించి మెప్పించింది.అది సింధు తోలాని యంగర్ వెర్షన్ పాత్ర.చాలామంది ఆమె “పెళ్లి సందD” సినిమాతోనే తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయం అయిందని భావిస్తారు.కానీ మొదట్లో ఈ చిన్న క్యారెక్టర్ ఆమె చేసింది.తర్వాత రెండు కన్నడ సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది.
అనంతరం తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.
సాయి పల్లవి

లేడీ పవర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి చదువుకుంటున్న రోజుల్లోనే సినిమా అవకాశాలను పొందింది.ప్రేమమ్ డైరెక్టర్ ఆల్ఫోన్స్ పుత్రేన్ ఆమెను చాలాసార్లు బతిలాడి తన సినిమాలో హీరోయిన్‌గా తీసుకున్నాడు.సినిమాలో నటిస్తావా అని ఊకే అడుగుతున్నప్పుడు ఆమె మొదటగా రిజెక్ట్ చేసింది.
మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తుంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని కూడా బెదిరించింది.ఆ తర్వాత అసలు సంగతి తెలిసి యాక్ట్ చేయడానికి ఒప్పుకుంది.దీనికంటే ముందు ఈ అందాల తార రెండు తమిళం సినిమాల్లో నటించింది.
“కస్తూరి మాన్ (2005)” సినిమాలో కాలేజీ అమ్మాయిగా సాయి పల్లవి నటించింది.ఒక జూనియర్ ఆర్టిస్ట్‌గా ఆమెకు క్రెడిట్ ఇచ్చారు.తర్వాత “ధామ్ ధూమ్ (2008)” యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో హీరోయిన్ కంగనా రనౌత్ కు చెల్లెలుగా నటించింది.
అమృత అయ్యర్

సూపర్ హీరో ఫిల్మ్ హను-మాన్ (2024)లో అమృత అయ్యర్( Amritha Aiyer ) హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.ఈ మూవీ కంటే ముందు ఆమె రజనీకాంత్ హీరోగా చేసిన “లింగ” సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.తేజ సజ్జ సినిమాతో హీరోయిన్ అయ్యింది.
త్రిష
సౌత్ ఇండియన్ క్వీన్ హీరోయిన్ గా మారకముందు “జోడి” సినిమాలో సిమ్రాన్ పక్కన సైడ్ యాక్టర్ గా నటించడం జరిగింది.ఆమె కొన్ని మ్యూజిక్ వీడియోలో కూడా యాక్ట్ చేసింది.
రీతూ వర్మ
ఎక్స్‌ప్రెషన్ క్వీన్ రీతు వర్మ( Ritu Varma ) హీరోయిన్ గా మారకముందు ఎన్టీఆర్ “బాద్షా” సినిమాలో కాజల్ ఫ్రెండ్ గా నటించింది.