కథలో దమ్ముంటే.. ఈ హీరోలపై రూ.100 కోట్లు అయినా పెట్టొచ్చు..?

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చాలా టాలెంటెడ్ హీరోలు ఉన్నారు.వీళ్లు ఎలాంటి పాత్రలోనైనా నటించి సినిమాని రక్తి కట్టించగలరు.కథలో దమ్ముంటే వీరిపై రూ.100 కోట్లు అయినా వెచ్చించవచ్చు.వీరి సినిమాపై పెట్టిన బడ్జెట్‌కి రెండు కంటే ఎక్కువ రెట్లు కలెక్షన్లు కూడా రాబట్టవచ్చు.మరి ఆ హీరోలు ఎవరు అనేది తెలుసుకుందాం.

 Tollywood Producers Who Are Ready To Invest 100 Crores ,adivi Sesh, Tollywood P-TeluguStop.com

అడివి శేష్

Telugu Adivi Sesh, Dulquer Salmaan, Karthikeya, Lucky Bhaskar-Movie

అడివి శేష్ ( Adivi Sesh )చాలా టాలెంటెడ్ యాక్టర్.సక్సెస్‌ఫుల్ డైరెక్టర్, స్క్రీన్ రైటర్‌గానూ పనిచేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు.అడివి శేష్ “గూఢచారి (2018)”లో హీరోగా నటించాడు.శశి కిరణ్ తిక్క డైరెక్టర్‌.ఈ యాక్షన్ మూవీ రూ.6 కోట్లతో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద రూ.25 కోట్ల దాకా మనీ వసూలు చేసింది.ఈ నటుడి యాక్టింగ్ టాలెంట్ చూసిన తర్వాత మహేష్ బాబు ఫిదా అయ్యారు.అంతేకాదు తన సతీమణితో కలిసి అడివి శేష్‌పై రూ.32 కోట్లు పెట్టి “మేజర్” సినిమా నిర్మించారు.ఈ బయోగ్రాఫికల్ యాక్షన్ డ్రామా చిత్రం 2008 ముంబై దాడుల్లో అమరులైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొంది పాన్ ఇండియా వైడ్‌గా సూపర్ హిట్ అయింది.రూ.66 కోట్లు కూడా కలెక్ట్ చేసింది.ఇక “హిట్: ది సెకండ్ కేసు”పై పెట్టిన పెట్టుబడికి మూడు రెట్లు వసూలు చేసింది.మొత్తం మీద ఈ హీరో మార్కెట్ బాగా పెరిగింది.ఇప్పుడు మంచి కథతో అతనిపై రూ.100 కోట్లు బడ్జెట్ పెట్టినా నష్టపోయే ఛాన్సే ఉండదు.

దుల్కర్ సల్మాన్

Telugu Adivi Sesh, Dulquer Salmaan, Karthikeya, Lucky Bhaskar-Movie

మంచి స్టోరీ ఉంటే హీరో దుల్కర్ సల్మాన్‌( Dulquer Salmaan)పై కళ్లు మూసుకుని రూ.100 కోట్లు పెట్టొచ్చు.ఈ హీరో మార్కెట్ రేంజ్ ఆ లెవెల్‌లో పెరిగిపోయింది మరి.దుల్కర్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన పీరియడ్ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్ “సీతా రామం” సూపర్‌హిట్ అయిన సంగతి తెలిసిందే.ఇందులో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ టైటిల్ రోల్స్‌లో నటించారు.ఈ మూవీ రూ.25 కోట్లు పెట్టి తీస్తే రూ.91.4 కోట్లు కలెక్ట్ చేసింది.ఇప్పుడీ హీరో “లక్కీ బాస్కర్” అనే తెలుగు సినిమా చేస్తున్నాడు.దీని విడుదల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

నిఖిల్ సిద్ధార్థ

నిఖిల్( Nikhil Siddhartha) హీరోగా వచ్చిన “కార్తికేయ” మూవీ రూ.4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి రూ.20 కోట్లు కలెక్ట్ చేసింది.దానికి సీక్వెల్‌గా వచ్చిన మిస్టరీ యాక్షన్-అడ్వెంచర్ మూవీ “కార్తికేయ 2” రూ.117.87 కోట్లు వసూలు చేసింది.దీన్ని జస్ట్ రూ.15 కోట్లతోనే తీశారు.ఇంటరెస్టింగ్ స్టోరీ, నిఖిల్ సాలిడ్ పెర్ఫార్మన్స్ కారణంగా ఈ మూవీ అంత పెద్ద హిట్టైంది.ఇలాంటి మంచి స్టోరీతో నిఖిల్‌ని హీరోగా పెట్టి రూ.100+ కోట్ల బడ్జెట్ సినిమా తీసినా నష్టం వచ్చే ఛాన్స్ తక్కువ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube