ఎస్ జె సూర్య( S.J.Suryah ).ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ తో పాటు తమిళ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు.ఒకప్పుడు సూర్య అంటే వాలి అలాగే ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు గుర్తుకు వచ్చేవారు.కానీ రాగాను అతనిలో ఉన్న ఫిలిం మేకర్ వెనక్కి వెళ్లిపోవడంతో నటుడిగా బాగా హైలైట్ అయ్యాడు అని చెప్పవచ్చు.
తెలుగులో నాని నటించిన డిజాస్టర్ మూవీని తమిళంలో రీమేక్ చేసి మంచి సక్సెస్ను అందుకున్నారు.ఈ సినిమాలో నటుడిగా సూర్యకి మంచు గుర్తింపు కూడా దక్కింది.ఆ తర్వాత నెమ్మదిగా దర్శకులు అందరి కళ్ళు కూడా సూర్య పై పడ్డాయి.
ఆ తర్వాత నెమ్మదిగా నెమ్మదిగా అవకాశాలు పెరగడంతో తనలో ఉన్న టాలెంట్ ని నిరూపించుకుంటూ ప్రేక్షకులకు బాగా చేరువ అవుతూ వచ్చారు సూర్య.ప్రస్తుతం విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న నటులలో సూర్య కూడా ఒకరు అని చెప్పవచ్చు.ఈ మధ్యకాలంలో సూర్య నటించిన విలన్ పాత్రలు బాగా పాపులర్ అయ్యాయి.
సైకో విలన్ పాత్రలో అద్భుతంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సూర్య.అంతేకాకుండా తమిళంలో సూర్యకు సైకో క్యారెక్టర్ పడిన ప్రతిసారీ అతను చెలరేగిపోయాడు.
నెంజం మరప్పదిల్లై, మానాడు లాంటి సినిమాల్లో సూర్య నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి.ఒకప్పుడు ప్రకాష్ రాజ్ కెరీర్ ఆరంభంలో ఆయన సైకో విలన్ పాత్రలు వేస్తే భలే అనిపించేది.
అయితే ఇప్పుడు సూర్య విషయంలో కూడా ప్రేక్షకులు అలాగే ఫీలవుతున్నారు.కొంచెం తేడాగా ప్రవర్తించే పాత్ర పడితే.సూర్య శైలికి బాగా నప్పుతోంది.తాజాగా నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం సినిమా( Saripodhaa Sanivaaram )లో కూడా సైకో తరహా పాత్ర చేశాడు సూర్య.
తన అన్న ఆస్తి విషయంలో చేసిన మోసానికి కోపం వచ్చినపుడల్లా సోకుల పాలెం అనే ఊర్లోకి వెళ్లి అమాయకులను తీసుకొచ్చి చిత్ర హింసలు పెట్టే పాత్ర చేశాడు సూర్య.తన పైశాచికత్వం చూపించే సన్నివేశాల్లో సూర్య చెలరేగిపోయాడు.
సినిమాలో సూర్య కనిపించిన ప్రతిసారీ ప్రేక్షకులు అలెర్టవుతారు.ఆసక్తిగా ఆ సన్నివేశాలను ఫాలో అవుతారు.
ఆరంభం నుంచి చివరి వరకు అదిరే పెర్ఫామెన్స్ తో నాని లాంటి పెర్ఫామర్ ను కూడా డామినేట్ చేయగలిగాడు సూర్య.ఈ విధంగా సూర్య విలన్ పాత్రలలో అద్భుతంగా నటిస్తుండడంతో విలన్ పాత్రలు వెతుక్కుంటూ మరీ వస్తున్నాయి.
ప్రస్తుతం చాలా వరకు తెలుగు తమిళ సినిమాల దర్శకులకు సూర్య కూడా ఒక ఆప్షన్ గా మారాడు.