టాలీవుడ్ నందమూరి నటసింహం బాలయ్య బాబు( Nandamuri Balakrishna ) గురించి మనందరికీ తెలిసిందే.బాలకృష్ణ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో రాణిస్తున్నారు.
అయితే రెండు వైపులా వరుసగా విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు బాలయ్య బాబు.కాగా ఇటీవలె జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బాలయ్య బాబు మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే.
మరోవైపు సినిమాల్లో వరుసగా మూడు సినిమాలతో భారీ విజయాలను అందుకుని హ్యాట్రిక్ ను అందుకున్నారు.

ఇలా ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలతో క్షణం కూడా తిరిగి లేకుండా గడుపుతున్నారు బాలయ్య బాబు.ఇది ఇలా ఉంటే బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం తన కెరీర్ 109వ సినిమా దర్శకుడు కొల్లి బాబీ( Bobby Kolli)తో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ చిత్రం ఇప్పుడు శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది.
ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే ఈ సినిమా కోసం బాలయ్య రెండు మూడు లుక్స్ ని ప్రిపేర్ చేశారు కానీ తాజాగా నాలుగో లుక్ ఒకటి ఫ్యాన్స్ కి ఊహించని ట్రీట్ ఇచ్చింది.
అయితే ఇందులో బాలయ్య మళ్ళీ తన చెన్నకేశవరెడ్డి, నరసింహా నాయుడు రోజుల్లోకొల్లి బాబీ తరహాలో వింటేజ్ లుక్ లో కనిపించి అదరగొట్టారు.

కానీ ఈ లుక్ అయితే సినిమాలో లేదు అన్నట్టు తెలుస్తోంది.ఇది కేవలం ఒక యాడ్ షూటింగ్ కోసం మాత్రమే ప్రిపేర్ చేసింది అని టాక్.ఒకవేళ ఈ లుక్ కానీ సినిమాలో ఉండుంటే ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ వచ్చి ఉండేది అని చెప్పాలి.
ఏది ఏమైనప్పటికి ఈ లుక్ లో బాలయ్య బాబు మరింత యంగ్ గా కనిపిస్తున్నారు.ఇకపోతే బాలయ్య బాబు అభిమానులు అందరూ బాలయ్య బాబు తదుపరి సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
వరుసగా మూడు సినిమాలతో హ్యాట్రిక్ ను అందుకున్న విజయ బాలయ్య బాబు తదుపరి సినిమా కూడా తప్పకుండా విజయం సాధిస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.