అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. జార్జియాలో బస్సు యాత్ర ప్రారంభించిన హారిస్- వాల్జ్

అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి.డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి కమలా హారిస్,( Kamala Harris ) రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్‌లు( Donald Trump ) ప్రచారాన్ని పరుగులు తీయిస్తున్నారు.

 Us Presidential Election Harris And Walz Kick Off A 2-day Bus Tour In Georgia De-TeluguStop.com

ఇప్పటికే నల్లజాతి, దక్షిణాసియా, భారత సంతతి కమ్యూనిటీల మద్ధతు కమలా హారిస్‌కు లభిస్తోంది.ఓపీనియన్ పోల్స్, ముందస్తు సర్వేల్లోనూ ఆమె దూసుకెళ్తున్నారు.

దీనిని ఇలాగే కంటిన్యూ చేస్తూ .ట్రంప్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని కమలా హారిస్ పావులు కదుపుతున్నారు.

Telugu Bus, Democratic, Donald Trump, Georgia, Harris, Kamalaharris, Republican,

దీనిలో భాగంగా తన రన్నింగ్‌మెట్, మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్‌తో( Tim Walz ) కలిసి జార్జియాలో బుధవారం బస్సు యాత్రను( Bus Tour ) ప్రారంభించారు.ఇది రెండు రోజుల పాటు జరుగుతుందని హారిస్ – వాల్జ్ ప్రచార బృందం తెలిపింది.జార్జియా( Georgia ) దక్షిణ ప్రాంతంలోని రూరల్ ఏరియాల మీదుగా ఇది సాగుతుందని వెల్లడించింది.తీర ప్రాంత పట్టణం సవన్నాలో అతిపెద్ద ర్యాలీ నిర్వహించారు.

Telugu Bus, Democratic, Donald Trump, Georgia, Harris, Kamalaharris, Republican,

డెమొక్రాటిక్ పార్టీ మద్ధతుదారులు, ప్రచార సిబ్బంది, చిన్న వ్యాపార యజమానులు, ఓటర్లతో ఈ యాత్రలో మమేకం కానున్నారు.నవంబర్‌లో డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించాలంటే 2020లో జో బైడెన్( Joe Biden ) వైపు నిలబడిన అట్లాంటాతో పాటు రిపబ్లికన్ల కంచుకోటల్లోకి కూడా ప్రవేశించాలని కమలా హారిస్ ప్రచార బృందం భావిస్తోంది.ఈ ఏడు రాష్ట్రాల ట్రిప్ అనేది డెమొక్రాట్లు ఎప్పుడో ప్రారంభించాలని అనుకున్నారు.అయితే డెబ్బీ సైక్లోన్ ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేయడంతో నార్త్ కరోలినా, జార్జియా ట్రిప్‌లను వారు రద్దు చేసుకున్నారు.

తాజా యాత్రలో వాల్జ్ సవన్నాలోని టార్మాక్‌ వద్ద కమలా హారిస్‌ను కలుసుకుని సవన్నా స్టేట్ యూనివర్సిటీ విద్యార్ధులను పలకరించారు.యూఎస్ సీక్రెట్ సర్వీస్‌కు చెందిన బస్సులో హారిస్ – వాల్జ్‌లు బయల్దేరారు.

దీనిపై ‘‘ ఏ న్యూ వే ’’ అనే అక్షరాలను రాశారు.గురువారం ర్యాలీతో పాటు హారిస్, వాల్జ్‌లు ఉమ్మడిగా సీఎన్ఎన్ యాంకర్ డానా బాష్‌కు ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు.

ఇది ఇవాళ రాత్రి ప్రసారం కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube