ప్రస్తుతం సోషల్ మీడియా( Social Media ) యుగంలో చిన్నపిల్లలు, పెద్దవారు అన్న తేడా లేకుండా ప్రతి ఒకరు కూడా ఇంటర్నెట్ యూజ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.ఈ క్రమంలో కొంతమంది ఫేమస్ అవుతూ ఉంటే.
మరికొందరు అందరి మన్నలని పొందుతూ ఉంటారు.ఇక ఈ క్రమంలో సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది.
తాజాగా ఒక చిన్న పాప,( Toddler ) డాల్ఫిన్( Dolphin ) మధ్య ఉన్నస్నేహానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.
వైరల్ అవుతున్న వీడియో( Viral Video ) ఆధారంగా.ఒక చిన్న పాప, డాల్ఫిన్ మధ్య ఉన్న సంభాషణ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.అక్వేరియంలో ఉన్న డాల్ఫిన్ ను చూసి ఆ చిన్నారి ఎంతో ఉత్సాహంగా అక్కడకు వెళ్లి హాయ్ చెప్పింది.
అది చూసిన డాల్ఫిన్ వెంటనే అక్కడే ఆగి చిన్నారిని హాయ్ చెప్తున్నట్లు నోరు తెరిచింది.అలాగే తన తోకపై నీటిలో నిల్చోని పాపతో ఏదో సంభాషిస్తున్నట్లు కూడా మనం గమనించవచ్చు.
ఈ క్రమంలో వెంటనే ఆ చిన్నారి డాల్ఫిన్ దగ్గరకు వెళ్లి ఎంతగానో సంతోష పడిపోయింది.
ఈ సన్నివేశాన్ని చూస్తుంటే చిన్నారి డాల్ఫిన్ వద్ద చాలా పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది.ఇక ఈ వీడియోని చూసిన నెటిజన్స్ వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు.ఇందులో భాగంగానే కొందరు డాల్ఫిన్లు చాలా తెలివిగలరని కామెంట్స్ చేస్తుండగా.
మరి కొందరేమో.వీడియో చూడడానికి ఎంత అద్భుతంగా ఉందో అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని చూసి మీకేమనిపించిందో ఓ కామెంట్ చేయండి.