డెలివరీ సర్వీస్ జెప్టోలో ఒక రోజు పని చేసిన హైదరాబాద్ యువకుడు.. ఎర్నింగ్స్ ఇవే..?

ఇండియాలో డెలివరీ సర్వీసులు అందిస్తున్న కంపెనీల సంఖ్య బాగా పెరిగిపోతోంది.నిరుద్యోగులు వీటిలో చేరవచ్చా లేదా అనే సందేహంలో ఉండిపోతున్నారు.

 Hyderabad Man Joins Zepto As Part-time Delivery Partner Highlights Issues And Ea-TeluguStop.com

ఇలాంటి వ్యక్తుల డౌట్స్ క్లియర్ చేయడానికి కొందరు 1-డే డెలివరీ పార్ట్‌నర్‌గా వర్క్ చేసి ఎర్నింగ్స్, ఛాలెంజ్‌లు, ఇతర ముఖ్యమైన విషయాలు తెలియజేస్తున్నారు.ఇటీవల ఓ బెంగళూరు మహిళ బ్లింకిట్ కంపెనీలో డెలివరీ పార్ట్‌నర్‌గా పార్ట్ టైమ్ జాబ్ చేసింది.

ఆమె అనుభవాలను చూసి హైదరాబాద్‌లో( Hyderabad ) ఒకాయన కూడా జెప్టో( Zepto ) అనే ఇంకో కంపెనీలో డెలివరీ పార్ట్‌నర్‌గా పని చేయాలని నిర్ణయించుకున్నాడు.

అనుకున్నదే తడవుగా ఈ పని చేశాడు.

ఆ పని చేస్తున్నప్పుడు ఎదురైన కొన్ని కష్టాల గురించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు.ఈ జాబ్‌లో కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని సరిచేయాలని చెప్పాడు.

ఆ హైదరాబాద్‌ వాసి పేరు దినేష్.( Dinesh ) ఒక రోజు డెలివరీ బాయ్‌గా పని చేసిన దినేష్ జెప్టో కంపెనీ ఎలా పని చేస్తుందనేది తెలుసుకోవడానికి ఇతర డెలివరీ బాయ్‌లు, కస్టమర్లు, స్టోర్ మేనేజర్లతో మాట్లాడాడు.అలా ఆ పని గురించి చాలా విషయాలు తెలుసుకున్నాడు.

దినేష్ చెప్పిన విషయాల ప్రకారం జెప్టోలో ఫుల్‌టైమ్‌ జాబ్ (రోజుకు 9 గంటలు) పని చేస్తే నెలకు రూ.40,000 వరకు సంపాదించవచ్చు.పార్ట్‌టైమ్‌ జాబ్ అంటే రోజుకు 4-5 గంటలు పని చేస్తే నెలకు రూ.25,000 వరకు సంపాదించవచ్చు.సండే స్పెషల్: ఆదివారం మాత్రమే 9 గంటలు పని చేస్తే నెలకు రూ.12,000 వరకు ఎర్న్ చేయవచ్చు.దినేష్ జెప్టో డెలివరీ బాయ్‌గా( Zepto Delivery Boy ) పని చేసినప్పుడు కొన్ని సమస్యలను గమనించాడు.

అతని ప్రకారం కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ల డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్‌లో కొన్ని సమస్యలు ఉన్నాయి.ఫోన్‌లో డాక్యుమెంట్లను ఫోటోలు తీస్తే అవి మసకగా లేదా తప్పుగా వస్తున్నాయని చెప్పాడు.ఈ ప్రాసెస్‌ను ఆటోమేట్ చేస్తే పని సులభమవుతుందని సూచించాడు.వెరిఫికేషన్ అయ్యాక ఏం చేయాలో క్లియర్‌గా చెప్పడం లేదని అన్నాడు.ట్రైనింగ్ తీసుకోవడానికి ఇతర డెలివరీ బాయ్‌ల సహాయం తీసుకోవాలి.కానీ అందరూ బిజీగా ఉండడం వల్ల సహాయం చేయడానికి అంగీకరించలేదట.

మేనేజర్లు ఇక్కడ సహాయం చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డాడు.

స్టోర్‌లో డెలివరీ బాయ్‌లకు కూర్చోవడానికి ప్రత్యేకమైన చోటు లేదట.

వాటర్ డిస్పెన్సర్లు కూడా పని చేయడం లేదు.వర్షం పడినప్పుడు తడిసే పరిస్థితి ఉందని, రెయిన్‌కోట్ లాంటి వస్తువులు కూడా స్టోర్‌లో అందుబాటులో లేవని ఆయన చెప్పాడు.

డైలీ 24 ఆర్డర్లు డెలివర్ చేస్తే వారానికి 168 ఆర్డర్లు చేయవచ్చని చెప్పాడు.ఇలా చేస్తే మంత్లీ రూ.32,941 ఎర్న్ చేయవచ్చని పేర్కొన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube