మనదేశంలో ఎన్నో విభిన్న కులమతాలు ఉన్నప్పటికీ, వారి కుల మతాచారాలకు తగ్గట్టుగా ఎన్నో సాంప్రదాయాలను పాటిస్తుంటారు.మన సాంప్రదాయాల ప్రకారం ఏదైనా ఒక కార్యాన్ని నిర్వహించేటప్పుడు అందుకు తగ్గ కారణాలు కూడా వివరించబడి ఉన్నాయి.
ఇలాంటి ఎన్నో సాంప్రదాయాలను మనం నిత్యం ఆచరిస్తూ ఉంటాము.ఈ సాంప్రదాయాలలో భాగంగా మన ఇంట్లో ఎవరైనా చనిపోతే వారికి పిండప్రధానం చేసిన తర్వాత ఆ పిండాన్ని కాకులకే పెడతారు.
అలా పిండాన్ని కాకులకు ఎందుకు పెడతారు, దాని వెనుక ఉన్న కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం….

చనిపోయిన మన పెద్దలకు పిండ ప్రధానం చేసిన తర్వాత ఆ పిండాన్ని కాకుల పెట్టడం మన సాంప్రదాయం.కేవలం పిండప్రధానం చేసేటప్పుడు మాత్రమే కాకులను ఎంతో పవిత్రంగా భావిస్తారు.సాధారణ పరిస్థితులలో అయితే కాకి చెడుకు కారణమని, కాకి తగిలితే శని ప్రభావం ఉంటుందని ఎంతో మంది భావిస్తుంటారు.
అంతే కాకుండా కాకి ఇంట్లోకి వస్తేఆ ఇంటికి అరిష్టం అని భావించి ఇంటిని మొత్తం శుభ్రం చేసి పురోహితుల చేత శాంతి హోమాలు నిర్వహిస్తారు.కాకి మన ఇంటి పై అరిస్తే మన ఇంటికి ఎవరో చుట్టాలు వస్తారని నమ్ముతుంటారు.
ఇలా కాకి గురించి ఎన్నో తెలిసి తెలియని విషయాలను చెబుతూ ఉండటం మనం వినే ఉంటాం.
చనిపోయిన మన పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం మన భారతీయ సంప్రదాయాలలో ఒక భాగం.
అయితే ఏవైనా కాకులు వచ్చి మన ఇంటి ముందు అరిస్తే మన ఇంట్లో చనిపోయిన వారి ఆత్మ కాకిలోకి వచ్చి మన ఇంటికి వచ్చింది అని భావిస్తుంటారు.అలా భావించి కాకులకు అన్నం పెట్టడం మనం చూస్తుంటాం.
పురాణాల ప్రకారం యమలోకంలో నరకం అనుభవించే వారికి యమధర్మరాజు ఒక వరం ఇచ్చాడు.కాకులు ఎవరి పిండం అయితే తింటాయో వారికి ఈ నరక బాధల నుంచి విముక్తి కలుగుతుందనే వరాన్ని ఇవ్వడంతో అప్పటి నుంచి పిండ ప్రధానం చేసిన తర్వాత కాకులకు పెట్టడం ఒక ఆనవాయితీగా, ఆచారంగా వస్తోంది.
మన పితృదేవతలకు సమర్పించిన పిండాన్ని ఎలాగైనా కాకులు తినేలా చేస్తుంటారు.