తపస్సు సాధనలో మూడు రకాలు ఉన్నాయి, అవి ఏవి?

తపస్సు సాధనలో మూడు రకాలు ఉంటాయి.అయితే అవి ఏమిటో మనం ఇప్పుడు తెలుసు కుందాం.

 There Are Three Types Of Thapassu Sadhana, Thapassu, Three Types , Devotional-TeluguStop.com

తపస్సు సాధనలో మొదటిది మనస్సు.రెండోది వాక్కు.

మూడోది కాయం అంటే శరీరంతో చేసేది.మనస్సుతో చేసే తపస్సును మానసిక తపస్సు అని అంటారు.

మనస్సును నిర్మలంగా ఉంచుకోవడం, సౌమ్యంగా అంటే మంచిగా ఉండటం, నీ ఇష్ట దేవతా మంత్రాన్ని ఎల్లప్పుడూ మననం చేసుకుంటూ ఉండటం.పవిత్ర భావాలు కల్గి ఉండటం, మనస్సును అదుపులో ఉంచుకోవడం… వీటినే మానసికమైన తపస్సు అంటారు.

అలాగే రెండోది వాక్కుతో ఇతరులను నొప్పించు కుండా ఉండటం, సత్యాన్ని మాత్రమే మాట్లాడటం, అసత్యాలు చెప్పకుండా ఉండటం, ప్రియం, హితమైన మాటలు మాత్రమే మాట్లాడటాన్ని వాక్కుకి సంబంధించిన తపస్సు అంటారు.అలాగే పురాణ ఇతిహాసాలు అంటే మహా భారతం, భాగవతం, రామాయణం వంటి మొదలగు గ్రంథాలు చదవడాన్ని కూడా వాక్కుకి సంబంధించిన తపస్సు అనే అంటారు.

మూడోది కాయం అంటే శరీరంతో చేసేది.శరీరంతో తల్లి దండ్రులు, దేవతలు, గురువులను, పెద్దలను పూజించటాన్ని.

శుచిగా ఉండటాన్నిఅంటే బాహ్య శరీరాన్ని మాత్రమే కాదు మనసును కూడా శుభ్రంగా, కల్మషంగా ఉంచు కోవాలి.అలాగే కుయుక్తులు పన్నరా.

బ్రహ్మచర్యం, అహింస అనేవి శారీరక తపస్సు.మనం చేయవలసింది శరీరాన్ని తపింప చెయ్యడం కాదు.

  మన లోపాన్ని చెడు ప్రవర్తనను, చెడు ఆలోచనలనూ తపింప చేస్తూ.గాయత్రీ మంత్రం జపిస్తే దైవ దర్శనాలు లభ్యం అవుతాయి.

దైవం నీకు తోడు గాను ఉంటుంది.ఇలా చేసే మూడు రకాల తపస్సులతో ఆ భగవంతుడి కృపను పొందవచ్చు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube