ముఖ్యంగా చెప్పాలంటే హనుమాన్ జయంత( Hanuman Jayanti )నీ హిందూ పండుగలలో ముఖ్యమైన పండుగగా జరుపుకుంటారు.అలాగే మత విశ్వాసాల ప్రకారం హనుమాన్ జయంతి పండుగను సంవత్సరానికి రెండు సార్లు జరుపుకుంటారు.
దీని వెనుక రెండు భిన్నమైన నమ్మకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.ఒకటి హనుమంతుడి జయంతిని ఆంజనేయ స్వామి పుట్టినరోజున జరుపుకుంటారు.
రెండవది సీతాదేవి హనుమంతుడిని చిరంజీవిగా ఉండాలని ఆశీర్వదించిన రోజున ఈ పండుగను జరుపుకుంటారు.

ఈ నేపథ్యంలో ఏప్రిల్ లో హనుమాన్ జయంతి ఏ రోజు వస్తుంది.ఈ రోజు కు సనాతన ధర్మంలో ఉన్న ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ప్రతి ఏడాది చైత్రమాసం పౌర్ణమి( Chaitra Masam ) రోజున హనుమంతుడి జన్మదినోత్సవం జరుపుకుంటారు.హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం పూర్ణిమ తిధి ఏప్రిల్ 23వ తేదీన తెల్లవారు జామున 3.25 నిమిషములకు మొదలై, ఏప్రిల్ 24వ తేదీన ఉదయం 5.18 నిమిషములకు ముగిస్తుంది.అటువంటి పరిస్థితుల్లో హనుమంతుడి జయంతిని ఏప్రిల్ 23న మంగళవారం రోజున జరుపుకోనున్నారు.
ముఖ్యంగా చెప్పాలంటే రామ భక్తుడు హనుమంతుడి( Lord Hanuman ) పుట్టిన రోజుకు ఎంతో ప్రాముఖ్యతను ఉంది.

మాత విశ్వాసాల ప్రకారం బజరంగబలిని ఈ రోజున హృదయపూర్వకంగా పూజించే భక్తుల కష్టాలన్నీ తొలగిస్తాడు.అంతేకాకుండా అన్ని రకాల బాధల, ఇబ్బందుల నుంచి విముక్తి కలిగిస్తాడు.హనుమాన్ జయంతి సోదర భావం, ఐక్యతకు చిహ్నంగా పరిగణించబడుతుంది.
ఎందుకంటే హనుమంతుడి భక్తులందరూ కలిసి ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు.ఈ రోజున ఉదయాన్నే నిద్ర లేచి హనుమంతుడిని స్మరించుకుని హృదయపూర్వకంగా నమస్కరించాలి.
తర్వాత ఇల్లు శుభ్రం చేసి స్నానం చేయాలి. గంగా జలం ఉంటే స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేయడం ఎంతో మంచిది.
ఎరుపు రంగు పూలు, పండ్లు, ధూపం, దీపం, సింధూరం మొదలైన వాటితో హనుమంతుడిని పూజించడం శుభప్రదంగా భావిస్తారు.