హనుమాన్ దేవాలయాల్లోని ఆంజనేయ స్వామి( hanuman ) సింధూరం రంగులోనే భక్తులకు దర్శనం ఇస్తారు.ఆంజనేయుడి దేవాలయంలో భక్తులు నుదుట ధరించే కుంకుమ కూడా సింధూరమే.
మారుతికి ఈ రంగు కు ఉన్న సంబంధం ఏమిటి? హనుమంతునికి సింధూరాన్ని పుయడం వెనుక అంతర్యం ఏమిటి? పురాణాలు ఏమి చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో హనుమంతుడిని పూజిస్తారు.
కొలిచిన వారికి తలచిన వారికి కొండంత అండగా ఉంటాడని భక్తులు నమ్ముతారు.అందుకే దేవుళ్ళు ఎంత మంది ఉన్నా వారిలో హనుమంతుడు వెరీ స్పెషల్ అని భక్తులు చెబుతూ ఉంటారు.
అయితే హనుమంతునికి సింధూరం రంగుకు ఎంతో అవినాభావ సంబంధం ఉందని పురాణాలు చెబుతున్నాయి.జెండాపై ఎగురుతున్న కపిరాజు చాలా ఫేమస్.ఒక చేతిలో గద, మరో చేతిలో పర్వతాన్ని మోస్తున్న హనుమాన్ ఆకాశంలో రివ్వున ఎగిరిపోతున్నట్లుగా ఈ చిత్రం ఉంటుంది.ఆ జెండా రంగు సింధూరం.
అలాగే తన దేవాలయంలో ఆంజనేయ స్వామి సింధూరం రంగులోనే దర్శనం ఇస్తాడు.ఆలయాలలో హనుమంతుని విగ్రహాలు ఎక్కువగా సింధూరం రంగులో ఉండడం వెనుక పురాణాలలో ఒక కథ ఉంది.
రామాయణం ప్రకారం ఒక రోజు హనుమంతుడు సీతమ్మ వారి దగ్గరకు వెళ్ళాడు.

ఆ సమయంలో సితాదేవి ( Sita devi )నుదిటి పై ఎర్రటి పొడి ధరిస్తూ ఉంటుంది.అప్పుడూ ఆంజనేయ స్వామి అమ్మ ఏంటి ఆ పొడి? దాన్ని ఎందుకు పెట్టుకుంటారు? దాని ప్రాముఖ్యత ఏమిటి అని అడిగాడని వ్యాసమహర్షి తెలిపాడు.హనుమాన్ ఇది సింధూరం.
ఇది శ్రీరాముడినిSita devi సంతోషపరుస్తుంది.సంపన్నమైన దీర్ఘాయువును ప్రసాదిస్తుంది.
సకల ఐశ్వర్యాలను కలిగిస్తుంది.అని వాయు పుత్రుడికి సీతమ్మ చెబుతుంది.
అందుకే తను పాపిట సింధూరం ధరిస్తానని చెబుతుంది.ఈ మాటలు విన్న హనుమంతుడు వెంటనే అక్కడి నుంచి అదృశ్యమవుతాడు.

ఆ తర్వాత హనుమంతుడు తన శరీరమంతా పూర్తిగా ఎరటి సింధూరం రాసుకుని తిరిగి వస్తాడు.శరీరంతో పాటు దుస్తులు కూడా సింధూరం రంగుతో నింపుకుంటాడు.సింధూరంతో శరీరాన్ని కప్పుకున్న హనుమంతుడు అలాగే రాముడు వద్దకు వెళ్తాడు.అది చూసిన శ్రీ రాముడు ఆశ్చర్యపోతాడు.అందుకు గల కారణమేమిటి అని ఆంజనేయ స్వామిని అడుగుతాడు.అప్పుడు వాయు పుత్రుడు శ్రీరామునితో ఇలా చెబుతాడు.
తనకు, సీతామాతకు కలిగిన సంభాషణ గురించి చెబుతాడు.ఆంజనేయ స్వామి ఇలా చేయడం వల్ల సంతోషించిన శ్రీరాముడు ఆయన భక్తులకు ఒక వరం ఇచ్చాడు.
ఎవరైతే హనుమంతునికి పూర్తి సింధూరాన్ని పూసి పూజిస్తారో వారికి సంతోషకరమైన దీర్ఘాయువుతో పాటు కూరిన కోరికలు నెరవేరుతాయని వరాన్ని ఇచ్చాడు.