దీపావళి( Diwali ) ముందుగా వచ్చే దంతేరాస్ ను మనం తెలుగులో ధన త్రయోదశి అని పిలుస్తాము.ఈ రోజున కచ్చితంగా బంగారం కొనే ఆచారం ఉంది అని చాలామంది ప్రజలకు తెలుసు.
దీపావళికి సరిగ్గా రెండు రోజులు ముందు ఈ పర్వదినం వస్తుంది.ఈ సంవత్సరం నవంబర్ 10వ తేదీన ఈ పర్వదినం వచ్చింది.
ఈ సందర్భంగా చాలా మంది లక్ష్మీదేవి ప్రతిమను,లక్ష్మీదేవి( Goddess Lakshmi ) రూపును బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు.సంపద ను ప్రసాదించిన లక్ష్మీదేవికి, కుబేరుడికి పూజలు కూడా చేస్తూ ఉంటారు.
ఇటీవల కాలంలో ఈ సందర్భంగా చాలా దుకాణాలలో ఆకర్షణమైనా ఆఫర్లు పెడుతూ వస్తున్నారు.దీంతో చాలా మంది అనేక వస్తువులను కొనుగోలు చేసి ఇంటికి వస్తున్నారు.

అంటే బంగారమే కాకుండా వెండి, ఇత్తడి, రాగి, కంచు లాంటి వస్తువుల్ని కొనుగోలు చేస్తున్నారు.అలాగే వాహనాలు, ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు,( Laptops ) ఫ్రిజ్ లు లాంటి ఇంటి అలంకరణ వస్తువులను కూడా కొని తెచ్చుకుంటున్నారు.మరి ఈ రోజు అస్సలు ఇంటికి తెచ్చుకోకూడని వస్తువులు కూడా కొన్ని ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.అలాంటి వాటిని తెచ్చుకోవడం వల్ల దురదృష్టాన్ని ఇంటికి తెచ్చుకున్నట్లే అని పండితులు చెబుతున్నారు.
మరి ఆ వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే ఇనుప వస్తువులు, ఇనుముతో చేసిన వంట సామాన్లను ధన త్రయోదశి రోజున అసలు కొనకూడదు.
ఇనుమును ఇంటికి తెచ్చుకోవడం వల్ల కుబేరుని ఆశీస్సులు దొరకవు అని చాలామంది ప్రజలు నమ్ముతారు.

అలాగే ధన త్రయోదశి( Dhana Triodasi ) రోజు స్టీల్ వస్తువులు కొనకూడదు.ఇలా చేయడం వల్ల మనకు, మన కుటుంబానికి దురదృష్టం తెచ్చిపెడుతుందని చెబుతున్నారు.అలాగే ఈ పవిత్రమైన రోజున చాకుల లాంటి పదునైన వస్తువులను ఇంటికి తెచ్చుకోకూడదు.
ఇవి మనకు అదృష్టాన్ని దూరం చేస్తాయి.ధన త్రయోదశి రోజు నూనె గాని, నెయ్యి గాని కొనకూడదు.
ఒకవేళ అవసరం అనుకుంటే ముందు రోజు కానీ,లేదంటే ఆ తర్వాత రోజు కాని తెచ్చుకోవాలి.ఇంకా చెప్పాలంటే ఈ ముఖ్యమైన రోజున బంగారానికి బదులుగా వన్ గ్రామ్ గోల్డ్ నగల్ని, లేదంటే గిల్టీ నగల్ని కొనుక్కొని ఇంటికి తెచ్చుకోకూడదు.
ఇది అ శుభంగా పండితులు9 Scholars )చెబుతున్నారు.