సినీ ఇండస్ట్రీలో నటిగా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందినటువంటి వారిలో నటి మాధవి లత (Madhavi Latha) ఒకరు అయితే ఈమె సినిమాలలో నటించి గుర్తింపు సంపాదించుకున్న దాని కన్నా సోషల్ మీడియాలో చేసే వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా భారీ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా సోషల్ మీడియా వేదికగా తరచూ వివాదాస్పద పోస్టులు చేయడం వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా ఈమె వార్తలలో నిలుస్తుంటారు.
తాజాగా ఈమె మరోసారి బాలకృష్ణ (Balakrishna) హీరోగా నటించిన భగవంత్ కేసరి (Bhagavanth Kesari) సినిమా గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

భగవంత్ కేసరి సినిమాలో హీరో బాలకృష్ణ చేత గుడ్ టచ్ బ్యాడ్ టచ్( Good Touch Bad Touch ) గురించి ఎంతో అద్భుతంగా చూపించారు.ఈ సీన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సీన్ ద్వారా మరింత జాగ్రత్తగా ఉండడానికి ఎంతో దోహదం చేస్తుందని చెప్పాలి.
అయితే ఈ సన్నివేశం గురించి నటి మాధవీ లత మాట్లాడుతూ.హీరోల చేత ఇలా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పించడం చాలా మంచి విషయం అయితే హీరోయిన్ పాత్రను గ్లామర్ కి పరిమితం చేసి హీరో చేత ఇలాంటి డైలాగ్స్ చూపించడం సరికాదు కానీ ఇందులో శ్రీ లీల( Sreeleela ) పాత్ర బాగుందని నేను కూడా విన్నాను.

ఇలాంటి డైలాగ్స్ చెప్పడం వల్ల ఎంతోమందికి ప్రయోజనకరంగా ఉంటుంది.అయితే ఈ డైలాగ్స్ చెప్పడమే కాదు వాటిని పాటిస్తే కూడా బాగుంటుంది అంటూ ఈమె షాకింగ్ కామెంట్ చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారింది.ఈమె ఎవరిని దృష్టిలో పెట్టుకొని ఏ ఉద్దేశంతో ఇలా చెప్పడమే కాదు పాటించాలి అని చెప్పారు.అంటూ పెద్ద ఎత్తున ఈమె వ్యాఖ్యలపై సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
ఏది ఏమైనా ఈమె బాలయ్య సినిమా గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది.







