Black beans : నల్ల శనగలు నానబెట్టిన నీరు ఉదయం పరిగడుపున తాగడం వల్ల అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..

ప్రస్తుత కాలంలో చాలామంది ప్రజలు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.ఇంకా చెప్పాలంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా పోషక ఆహారాలు తీసుకోవాలి.

 Are There All The Health Benefits Of Drinking Black Gram Soaked Water In The Mo-TeluguStop.com

శనగలలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. నల్ల శనగలను శుభ్రంగా కడిగి రాత్రిపూట నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఏమీ తినకుండా ఆ నీరు వడకట్టి తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

మనలో చాలామంది శనగలను నానబెట్టిన నీటిని బయట పారవేస్తూ ఉంటారు.ఆ నీరు మన ఆరోగ్యానికి అమృతం వంటిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

ఈ నీరు త్రాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.

ఇంకా చెప్పాలంటే అధిక బరువు సమస్య నుండి త్వరగా బయటపడే అవకాశం ఉంది.

కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా త్వరగా ఆకలి వేయదు.ఇంకా చెప్పాలంటే నీరసం, అలసట లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు.

డయాబెటిస్ ఉన్నవారు ఈ నీటిని తాగితే రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.డయాబెటిస్ ఉన్నవారు, చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు ఇలా చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఏమి తినకుండా ఈ నీటిని తాగడం వల్ల జీర్ణాశయం శుభ్రం అవుతుంది.ఈ నీటిలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల కడుపులో మంట, కడుపు ఉబ్బరం, బలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి.

Telugu Black Beans, Benefits, Problems, Tips, Problem-Telugu Health

ఈ నీరు చర్మాన్ని శుభ్రపరిచి చర్మం ఎప్పుడూ యవ్వనంగా ఉండేలా చేస్తుంది.ఈ నీటిలో కాలుష్యం, ప్రోటీన్, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి.ఐరన్ సమృద్ధిగా ఉండడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య దూరమవుతుంది.నల్ల శనగల నీటిని వడకట్టి అలాగే త్రాగవచ్చు.ఆ నీటిలో ఉప్పు నిమ్మరసం లేదా తేనె కలుపుకొని కూడా తాగవచ్చు.అలాగే గోరువెచ్చగా చేసి తాగితే కూడా మంచిదే.

ఇంకా చెప్పాలంటే ఇలా ఆ నీటిని త్రాగలేని వారు చపాతి పిండి కలిపినప్పుడు ఉపయోగించడం కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube