చంకల్లో దుర్వాసన తగ్గడానికి సూపర్ ఉపాయాలు

Super Tips To Remove Bad Smell In Under Arms

మన శరీరంలో దుర్వాసన ఎందుకు వస్తుంది, ఎక్కడినుంచి వస్తుంది అంటే, రెండు ముఖ్య ప్రదేశాల్లోంచి.చంకలు, వాటితో పాటు జననాంగాలు.

 Super Tips To Remove Bad Smell In Under Arms-TeluguStop.com

ఎందుకంటే దుర్వాసన కేవలం చెమట వలనే రాదు, బ్యాక్టీరియా ఉండటం వలన, మన చర్మకణాలు మృతి చెందటం వలన.ఈ మూడు కలిస్తేనే దుర్వాసన వస్తుంది.ఈ బ్యాక్టీరియా, మృత కణాల వలనే ఈ శరీర భాగాలు నలుపుగా మారుతాయి.వీటికి తోడు స్ట్రెస్, ఉష్ణోగ్రతలు ఆ దుర్వాసనని పెంచుతాయి.అందుకే చంకల్లో దుర్వాసన పోగొట్టుకోవడానికి కొన్ని ఉపాయాలు చెబుతున్నాం.

* ఆపిల్ సైడర్ వెనిగర్ బ్యాక్టీరియాని చంపుతుంది.

 Super Tips To Remove Bad Smell In Under Arms-Super Tips To Remove Bad Smell In Under Arms-Telugu Health-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రోజూ కాటన్ మీద ఆపిల్ సైడర్ వెనిగర్ పోసి, చంకలను తుడుచుకోండి.

* వినడానికి కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు కాని మద్యం కూడా చంకల్లోంచి వచ్చే దుర్వాసన పోగొడుతుంది.

అయితే మద్యం తాగకూడదు, చంకలకు కాటన్ తో రాయాలి.ఇది పోర్సద ని క్లోజ్ చేసి దుర్వాసన తగ్గిస్తుంది.

* నిమ్మతో కాని పనేముంది.ఇది విటమిన్ సి కలిగి, బ్యాక్టీరియాని చంపుతుంది.PH లెవల్స్ ని బ్యాలెన్స్‌ చేస్తుంది.కాటన్ లో నిమ్మరసంతో చంకల్లో అప్లై చేయండి.

* బ్యాక్టీరియాని అతి సలువుగా తొలగిస్తుంది రోజ్ వాటర్.కాటన్ లో కొంచెం రోజ్ వాటర్ తీసుకోని శుభ్రం చేసుకోండి.

రోజ్ వాటర్ స్ప్రే బాటిల్స్ లో కూడా దొరుకుతుంది.

* టామాట గుజ్జు కూడా చంకల దుర్వాసపై పనిచేస్తుంది.

గుజ్జు అప్ప్లై చేసుకోని, ఓ పదిహేను నిమిషాలు అలానే ఉంచి కడిగేసుకోండి.

* ఎన్నో స్కిన్ ప్రాబ్లమ్స్ ని దూరం చేసే లావెండర్ ఆయిల్, చంకల్లో బ్యాక్టీరియాపై కూడా తన ప్రభావం చూపిస్తుంది.

* పచ్చిపసుపు దంచి, దాంట్లో కొద్దిగా పాలు కలిపి రోజు పెట్టుకోండి, దర్వాసన తగ్గడమే కాదు, చంకల్లో ఉండే నలుపు కూడా తగ్గుతుంది.

* ఇవన్ని ఎందుకు, దర్వాసనని అడ్డుకోవాలంటే ఎలా? ఏముంది నీళ్ళు బాగా తాగాలి, బట్టలు రెగ్యులర్ గా మార్చకోవాలి, ఆల్కహాల్, కాఫీ తగ్గించాలి, రెడ్ మీట్ ఎక్కవ తినకూడదు.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube