ప్రస్తుత రోజులలో దాదాపు చాలామంది ప్రజలు వాస్తు శాస్త్రం( Vastu ) ప్రకారమే ఇంటిని నిర్మించుకుంటున్నారు.ఇంట్లో ఉంచుకునే వస్తువులను కూడా వాస్తు ప్రకారం అనుసరించినప్పటికీ మనకు తెలియకుండా కొన్ని చిన్నచిన్న తప్పుల వల్ల వాస్తు దోషాలను ఎదుర్కొంటూ ఉంటాము.
వాస్తు దోషాలు ప్రధానంగా ఇంట్లోనీ ప్రశాంతతను దూరం చేసి ఆర్థిక ఇబ్బందులకు కారణమవుతాయని పండితులు చెబుతున్నారు.అయితే ఆర్థిక ఇబ్బందులను దూరం చేసి కనక వర్షం కురిపించే కొన్ని సంకేతాలు కూడా అప్పుడప్పుడు మనకు ఇంట్లో కనిపిస్తూ ఉంటాయి.

ఈ సంకేతాలు ఇంటికి విపరీతమైన ధన లాభాన్ని చేకూరుస్తాయి.ఇంట్లోకి తాబేలు( Tortoise ) రావడం అనేది శుభ పరిణామంగా భావించాలి.ఇంట్లోకి తాబేలు వస్తే ఇంటికి సానుకూల శక్తిని తీసుకొని వస్తుంది.తాబేలు శ్రీమహావిష్ణువు యొక్క కూర్మావతారాన్ని సూచిస్తుంది.తాబేలు ఇంట్లోకి రావడం లక్ష్మి దేవి రాకకు గుర్తుగా భావించవచ్చు.ఆ ఇంట్లోనీ వారి ఆర్థిక ఇబ్బందులు దూరమై సంపద వర్షమై కురుస్తుంది.
అలాగే నల్ల చీమలు( Black Ants ) ఇంట్లోకి వస్తే శుభ పరిణామం అని ప్రజలు భావిస్తారు.ఆ ఇంట్లో సుఖసంతోషాలు ఉంటాయనేది వాస్తు నిపుణులు చెబుతున్నారు.
చీమల నోట్లో ఏదైనా తీసుకొని వస్తే ఇంటికి డబ్బు వస్తుందని అర్థం చేసుకోవచ్చు.ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అసలు రావని అర్థం చేసుకోవచ్చు.

ఇంట్లోకి కప్పలు వస్తే చిరాకుపడతారు.కానీ కప్పలు రావడం కూడా శుభసంకేతమని చెప్పాలి.కప్ప ఇంటికి వస్తే ఆ ఇంటికి అదృష్టం తెస్తుంది.కప్పలు ఇంటికి వస్తే లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.అంతేకాకుండా ఇంట్లోకి రామచిలుక వస్తే కూడా అదృష్టంగా భావించేవారు ఉన్నారు.రామచిలకలు ఇంట్లోకి ప్రవేశించడం వలన సంపద వృద్ధి జరుగుతుందని, వ్యాపారంలో లాభాలు వస్తాయి అని చెబుతున్నారు.
అలాగే రెండు తలలో పాము ఇంట్లోకి వస్తే ఆ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
DEVOTIONAL