రంజాన్ మాసం ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైనది.ఖగోళ శాస్త్ర గణాంకాల ప్రకారం ఈసారి ఏప్రిల్ 2 నుంచి రంజాన్ మాసం ప్రారంభం అయ్యింది.
ఈ పవిత్ర రంజాన్ మాసంలో, ప్రవక్త ముహమ్మద్ ఇస్లాం పవిత్ర గ్రంథమైన ఖురాన్‌ను ఆవిష్కరించినట్లు ముస్లిం సోదరులు నమ్ముతారు.రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు సూర్యాస్తమయం నుండి సూర్యోదయం వరకు ఉపవాసం ఉంటారు.
ఈ కాలంలో తినడం, త్రాగడంపై కఠినమైన పరిమితులు ఉంటాయి.ముస్లిం సోదరులు రంజాన్ మాసంలో చాలా గంటల పాటు ఆకలితో ఉంటూ తమ ఉపవాసాన్ని పూర్తి చేస్తారు.
అయితే భౌగోళిక వైవిధ్యం కారణంగా ఉపవాసం చేసే వ్యవధి ప్రపంచవ్యాప్తంగా మారుతూ ఉంటుంది.ఈ వ్యవధి 11 నుండి 20 గంటల వరకు ఉంటుంది.
ఐస్‌లాండ్‌లో నివసిస్తున్న ముస్లింలు 16-17 గంటల పాటు ఉపవాసం ఉంటారు. భారతదేశం, పాకిస్తాన్, సౌదీ అరేబియా, యుఎఇ, ఖతార్, మధ్యప్రాచ్యంలోని చాలా దేశాలలో నివసిస్తున్న ముస్లింలు ప్రతిరోజూ 14 నుండి 15 గంటల పాటు ఉపవాసం ఉంటారు.
అయితే న్యూజిలాండ్, అర్జెంటీనా, దక్షిణాఫ్రికా దేశాల్లో అతి తక్కువ వ్యవధిలో (11-12) ఉపవాసం ఉంటారు.ఐస్‌లాండ్‌తో సహా గ్రీన్‌లాండ్, ఫ్రాన్స్, పోలాండ్ మరియు ఇంగ్లండ్‌లో నివసిస్తున్న ముస్లింలు దాదాపు 16 నుండి 17 గంటల పాటు ఉపవాసం ఉంటారు.
కాగా పోర్చుగల్, గ్రీస్, చైనా, అమెరికా, టర్కీ, కెనడా, ఉత్తర కొరియా, జపాన్, పాకిస్థాన్, ఇరాన్, ఇరాక్, సిరియా, పాలస్తీనా, యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియా దేశాలలో దాదాపు 14 నుంచి 15 గంటల పాటు ఉపవాస దీక్ష చేపడతారు.సింగపూర్, మలేషియా, సూడాన్, థాయ్‌లాండ్ యెమెన్‌లలో ఉపవాసాన్ని 13 నుండి 14 గంటల పాటు ఆచరిస్తారు.
బ్రెజిల్, జింబాబ్వే, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, అర్జెంటీనా, న్యూజిలాండ్, పరాగ్వే, ఉరుగ్వేలలో 11 నుండి 12 గంటల అతి తక్కువ ఉపవాసాన్ని పాటిస్తాయి.