విజయవాడ: దుర్గగుడి ఈవో డి.భ్రమరాంబ కామెంట్స్.
సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకూ దసరా ఉత్సవాలు.ఈ ఏడాది 10 రోజుల పాటు ఉత్సవాలు.
పది రోజుల పాటు పది అలంకారాల్లో అమ్మవారి దర్శనం.మూలా నక్షత్రం రోజున సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుంటారు.
ఈ ఏడాది నెల రోజుల ముందే కో ఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం.దసరా మహోత్సవాలకు టెండర్లు పూర్తయ్యాయి.
ఘాట్ రోడ్డులో క్యూలైన్ల ఏర్పాటు పనులు మొదలయ్యాయి.ఈ ఏడాది 80 లక్షలతో ప్రత్యేకంగా విద్యుద్ధీకరణ.
ఈ ఏడాది కూడా అంతరాలయ దర్శనాలు లేవు.కరోనా తగ్గుముఖం పట్టడంతో సుమారు 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాం.
భక్తులకు 100 రూపాయలు, 300 రూపాయలు, ఉచిత దర్శనాలు.వీఐపీ బ్రేక్ దర్శనం ప్రతిపాదనల పై వచ్చే సమన్వయ కమిటీలో తుది నిర్ణయం తీసుకుంటాం.6+1 ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం.తిరుపతి మాదిరి నాణ్యత కలిగిన లడ్డూ ప్రసాదం అందిస్తాం.
భక్తుల కోసం ఛండీహోమం,శ్రీచక్రనవావార్చన, కుంకుమార్చనలు ఏర్పాటు.కుంకుమార్చనలో పాల్గొనే వారి కోసం 20 వేల టిక్కెట్లు ఆన్ లైన్ లో ఉంచాం.
భక్తులకు సాంబారు, పెరుగన్నం, బెల్లంపొంగలి అందిస్తాం.
గతంలో మాదిరిగానే నగరోత్సవం నిర్వహిస్తాం.
భవానీ భక్తులు దర్శనాలకు మాత్రమే రావాలి.భవానీల మాల వితరణకు అవకాశం లేదు.
వాటర్ ప్యాకెట్స్ బదులు ఆర్వో వాటర్ పాయింట్స్ ఏర్పాటు చేస్తున్నాం.గతేడాది 9.50 కోట్లు ఆదాయం రాగా 3 కోట్లు ఖర్చయ్యింది.ఈ ఏడాది 15 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా.సౌకర్యాలు పెంచుతున్న నేపధ్యంలో 5 కోట్లు ఖర్చవుతుందని భావిస్తున్నాం.21 లక్షల లడ్డూలు ఏర్పాటు చేస్తున్నాం.