కాలినడకన వచ్చే శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇకపై నూతనంగా అన్నదాన కార్యక్రమం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల దేవస్థానానికి ప్రతిరోజు ఎన్నో వేల మంది భక్తులు వచ్చి శ్రీవారిని దర్శించుకుని వెళుతూ ఉంటారు.దీనివల్ల తిరుమలలో ఎప్పుడు భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది.

 Good News For The Devotees Of Shrivari Who Come On Foot , Chairman Yv Subbareddy-TeluguStop.com

సంక్రాంతి పండుగ సందర్భంగా వేలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని వెళ్లారు.స్వామి వారికి తలనీలాలు కూడా సమర్పించారు.

భక్తుల తాకిడితో కంపార్ట్మెంట్లు భర్తీ అయ్యాయి.శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పట్టింది.

కనుమ రోజు నిర్వహించే పారువేట ఉత్సవానికి పెద్ద ఎత్తున భక్తులందరూ తరలివచ్చి ఎంతో వైభవంగా నిర్వహించారు.

Telugu Andhra Pradesh, Bakti, Devotional, Dharma Reddy-Latest News - Telugu

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై వి సుబ్బారెడ్డి కార్యనిర్వాహణాధికారి ధర్మారెడ్డి ఇతర ఉన్నతాధికారులు ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు.భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.ఈనెల 28వ తేదీన రథసప్తమి పండుగను వైభవంగా జరపడానికి ఇప్పటినుంచే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.

ఇంకా చెప్పాలంటే శ్రీవారి దర్శనం కోసం శ్రీవారి మెట్టు మార్గం గుండా కాలినడకన తిరుమలకు వచ్చే వేలాది మంది భక్తుల కోసం టీటీడీ అధికారులు ప్రత్యేక చర్యలను తీసుకుంటున్నారు.

Telugu Andhra Pradesh, Bakti, Devotional, Dharma Reddy-Latest News - Telugu

వారి ఆకలిని తీర్చడానికి మినీ అన్నదాన ప్రసాదం కాంప్లెక్స్ ను నిర్మించాలని నిర్ణయించారు.దీనికి సంబంధించిన పనులను వెంటనే మొదలుపెట్టారు.శ్రీవారి మెట్టు అత్యంత సమీపంలో ఉండే ఎంబిసి రోడ్డులో ఈ కొత్త అన్నదాన కాంప్లెక్స్ నిర్మించనున్నారు.

ఈ కాంప్లెక్స్ నిర్మాణ స్థలాన్ని టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి పరిశీలించారు.దీనితోపాటు కాలినడకన వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా ఎంబీసీ ఏరియాలో అందుబాటులో భూమిని ఆయన గుర్తించడం జరిగింది.

కాంప్లెక్స్ నిర్మాణానికి సాధ్యసాధ్యాలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.ఆ తర్వాత గోశాలలో జరిగిన కు పూజలో పాల్గొన్నారు.పాత అన్నదానం కాంప్లెక్స్ ను దర్శించిన చైర్మన్ స్వామి వారి భక్తులతో కలిసి ఆయన కూడా అక్కడే భోజనం చేశారు.టిటిడి అధికారులు అందిస్తున్న ఆహారం ఇతర సేవల నాణ్యతను భక్తులను అడిగి తెలుసుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube